BigTV English

IND Vs USA T20WC Match Preview: గెలిస్తే.. సూపర్ 8.. నేడే అమెరికాతో టీమ్ ఇండియా మ్యాచ్..!

IND Vs USA T20WC Match Preview: గెలిస్తే.. సూపర్ 8.. నేడే అమెరికాతో టీమ్ ఇండియా మ్యాచ్..!
Advertisement
India Vs United States of America Match Prediction – T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా మూడో మ్యాచ్ అమెరికాతో ఆడనుంది. న్యూయార్క్ వేదికగా జరిగే మ్యాచ్ పై మళ్లీ అంచనాలు పెరిగిపోయాయి. అందుక్కారణం ఏమిటంటే, అమెరికా చేతిలో పాకిస్తాన్ మట్టి కరవడమే. ప్రస్తుతం అమెరికా జట్టులో సగం మంది ప్రవాస భారతీయులే ఉన్నారు. అయితే వాళ్లలో ఐదుగురు.. నేటి మ్యాచ్ లో ఆడనున్నారు.

నిజానికి టీమ్ ఇండియా బలాలు, బలహీనతలు వాళ్లకి బాగా తెలుసు. రెండవది న్యూయార్క్ పిచ్ ఇంకా మనవాళ్లకి కొరుకుడు పడటం లేదు. కొమ్ములు తిరిగిన విరాట్ కొహ్లీ లాంటి బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోతున్నారు.


అటువైపు అమెరికాకు సొంత మైదానం కావడం కలిసి వచ్చేలా ఉంది. వారికి డ్రాప్ ఇన్ పిచ్ లపై ఆడిన అనుభవం ఉంది. ఈజీగా రన్స్ తీస్తున్నారు. అందుకని టీమ్ ఇండియా కొంచెం జాగ్రత్తగానే ఆడాల్సి ఉంటుంది. గెలిచిన జట్టు ఏదైనా సరే.. సూపర్ 8 కి డైరక్టుగా వెళుతుంది.

Also Read: ఎట్టకేలకు కెనడాపై పాకిస్తాన్ గెలుపు..


ఇక అమెరికా టీమ్ లో భారత సంతతి ఆటగాళ్లయిన సౌరభ్ నేత్రావాల్కర్, హర్మీత్ సింగ్, నితీశ్ కుమార్, కెప్టెన్ మోనాంక్ పటేల్, జస్ దీప్ సింగ్ ఉన్నారు. పాకిస్తాన్ మ్యాచ్ లో మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీ చేశాడు. నేత్రా వాల్కార్ సూపర్ ఓవర్ వేసి గెలిపించాడు. వీరు కాకుండా అమెరికా స్పిన్నర్ కెంజిగేతో అప్రమత్తంగా ఉండాలి. తనకి సులువుగా వికెట్లు వస్తున్నాయి.  వీరిని ఎదుర్కోవడానికి టీమ్ ఇండియా ప్రణాళికలు రచించాలి.

ఇక ఇండియా విషయానికి వస్తే.. విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ఫామ్ లోకి రావాలని భగవంతుడిని ప్రార్థించాలని నెటిజన్లు పేర్కొంటున్నారు. బౌలింగులో బుమ్రా, పాండ్యా కీలకం కానున్నారు. అయితే భారత్- అమెరికా మధ్య జరుగుతున్న మొదటి మ్యాచ్ ఇదే కావడం విశేషం. అందువల్ల టీమ్ ఇండియా గెలవాలని కోరుకుందాం. అలాగే అమెరికా కూడా సూపర్ 8 కి చేరుకుని ముందడుగు వేయాలని కోరుకుందాం.

ఎందుకంటే అమెరికాలాంటి అగ్రదేశం క్రికెట్ లో తొలిసారి అడుగుపెట్టింది. అందువల్ల ఆ దేశం గెలుస్తుంటే, వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అలా క్రికెట్ కి మంచి జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు.

Related News

IPL 2026: ఐపీఎల్ 2026 లో పెను సంచ‌ల‌నం…ఢిల్లీ, KKRకు కొత్త కెప్టెన్లు?

Commonwealth Games 2030 : 2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం..20 ఏళ్ల త‌ర్వాత ఛాన్స్‌

Mahieka Sharma: పెళ్ళి కాకముందే మహికా శర్మ ప్రెగ్నెంట్.. హార్దిక్ పాండ్యా కక్కుర్తి.. అప్పుడు నటాషాకు కూడా !

Natasa Stankovic: ప్రియుడితో రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటషా?

IPL Valuation: కొంప‌ముంచిన కేంద్రం…భారీగా ప‌డిపోయిన ఐపీఎల్ !

Ranji Trophy 2025: ప్ర‌మాదంలో పృథ్వీ షా జ‌ట్టు…5 ప‌రుగుల‌కే 4 వికెట్లు..నలుగురు బ్యాటర్లు డకౌట్!

Noman Ali Welding Glasses: పాకిస్థాన్ బౌల‌ర్ ఇజ్జ‌త్ తీసిన రమీజ్ రాజా..వెల్డింగ్ షాప్ కళ్లజోడు అంటూ

IND VS AUS: గంభీర్ కు చెప్ప‌కుండానే ఆస్ట్రేలియాకు బ‌య‌లుదేరిన‌ రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే

Big Stories

×