Ravichandran Ashwin : టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన కొద్ది నెలలకే టోర్నమెంట్ తో 16 ఏళ్ల అనుబంధానికి తెరపడింది. ” సంవత్సరాలుగా అద్భుతమైన జ్ఞాపకాలు, సంబంధాలకు అన్ని ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు నాకు ఇచ్చిన వాటికి ఐపీఎల్, బీసీసీఐ కి ధన్యవాదాలు. నా ముందున్న వాటిని ఆస్వాదించడానికి సద్వినియోగం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నారు అశ్విన్. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ కి అశ్విన్ రిటైర్మెంట్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ కు తొమ్మిది కోట్లకు పై మిగిలాయి. దీంతో ఆ డబ్బులతో సన్ రైజర్స్ హైదరాబాద్ కి చెందిన క్లాసెన్ ను ట్రేడ్ ద్వారా తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.
Also Read : Romario Shepherd: ఒక్క బాల్‌కు 22 రన్స్.. RCB ప్లేయర్ అరాచకం
కుంబ్లే తరువాత అశ్వినే..
చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ టీమ్ అని బలంగా నాటుకుపోయింది అభిమానుల్లో. ధోనీ, జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కాంబినేషన్ అంటే అదుర్స్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి మధ్యలో అశ్విన్ దూరమయ్యాడు. తిరిగి మళ్లీ వచ్చాడు. ముఖ్యంగా 38 ఏళ్ల అశ్విన్ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కి రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మరికొందరూ మాత్రం అశ్విన్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. గత ఏడాది డిసెంబర్ లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఆ కెరీర్ లో అనీల్ కుంబ్లే 619 తరువాత భారత్ తరపున టెస్టుల్లో రెండో అత్యధిక వికెట్లు 537 తీసుకున్న బౌలర్ గా నిలిచాడు అశ్విన్. ఐపీఎల్ లో అతను ఆడిన అత్యంత ప్రకాశవంతమైన వ్యక్తుల్లో ఒకడు.
దశాబ్దం తరువాత..
చెన్నై సూపర్ కింగ్స్ తరపున 2009లో ఆరంగేట్రం చేశాడు రవిచంద్రన్ అశ్విన్. దాదాపు దశాబ్దం కాలం తరువాత 9.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి చేరాడు. ఐపీఎల్ 2025 లో అతను చివరిసారిగా పసుపు జెర్సీలో కనిపించాడు. అశ్విన్ 221 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. 30.22 సగటుతో 187 వికెట్లు పడగొట్టాడు. అతని ఉత్తమ గణాంకాలు 34/4 బ్యాటింగ్ తో.. అత్యధికంగా 50 పరుగులు చేశాడు. 13.02 సగటుతో 833 పరుగులు చేశాడు. 2010, 2011 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ గెలుచుకున్న జట్టులో అశ్విన్ కీలక సభ్యుడు. లీగ్ తన కెరీర్ లో పని చేయని రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల తరపున ఆడాడు అశ్విన్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్విన్ ను CSK రూ.9.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఎం.ఎస్. ధోనీ కంటే దాదాపు రూ.6కోట్లు ఎక్కువ కావడం విశేషం. ధోనీని CSK అన్ క్యాప్డ్ కేటగిరిలో రూ.4కోట్లకు రిటైన్ చేసింది. అశ్విన్ జీతం ధోనీ కంటే రూ.5.75 కోట్లు ఎక్కువ. CSK అశ్విన్ ను తిరిగి తీసుకోవడానికి లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తో పోటీ పడి మరీ వేలంలో గెలిచింది.