Romario Shepherd : ప్రస్తుతం సీపీఎల్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే CPL లో గయానా టీమ్ కి ఒక్క లీగల్ డెలివరీకి 22 రన్స్ వచ్చాయి. సెయింట్ లూసియా టీమ్ బౌలర్ థామస్ నోబాల్స్ వేయడం, వాటిని గయానా బ్యాటర్ షెఫర్డు సిక్సర్లుగా మలచడమే దీనికి కారణం. అయితే 15వ ఓవర్ మూడవ బంతికి వరుసగా N, Wd, N6, N6, 6 మొత్తం 22 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న సంజూ శాంసన్ ఒక్క బంతికి 13 పరుగులు చేయడం మరిచిపోక ముందే ఇవాళ ఒక్క బాల్ కి 22 పరుగులు సాధించాడు షెపర్డ్.
Also Read : Mark Wood : రోహిత్ శర్మకు బౌలింగ్ వేయడం నా వల్ల కాదు.. ఇంగ్లాండ్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు
బీభత్సం సృష్టించిన షెఫర్డ్..
వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెఫర్డ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరపున సత్తా చాటుతున్నాడు. సెయింట్ లూసియా జట్టుతో జరిగిన ఓ మ్యాచ్ లో ఈ భారీ హిట్టర్ ఒక్క బంతికే 22 పరుగులు రాబట్టడం విశేషం. వాస్తవానికి 15 వ ఓవర్ లో థామస్ వేసిన మూడో బంతి నోబాల్ అయింది. ఈ బంతికి షెఫర్డ్ పరుగులు ఏమి చేయలేదు. ఆ తరువాత ఫ్రీ హిట్ వైడ్ గా వెళ్లింది. తరువాత వేసిన ఫ్రీ హిట్ ను షెఫర్డ్ భారీ సిక్స్ గా మలిచాడు. అయితే అది కూడా నోబాలే కావడం గమనార్హం. దీంతో తరువాత బంతిని కూడా బౌండరీ అవుతలికి తరలించాడు. ఇక్కడ దురదృష్టం మరోసారి బౌలర్ ని వెంటాడింది. అది కూడా నోబాల్ కావడంతో దీంతో మూడో ఫ్రీ హిట్ నూ షెఫర్డ్ ఉపయోగించుకొని సునాయసంగా మరో సిక్స్ కొట్టాడు. దీంతో ఒక్క లీగల్ డెలివరీకి మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఇక ఇలా 7వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన షెఫర్డ్ 34 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్స్ లు ఉండటం విశేషం.
ఆర్సీబీ తరపున కూడా..
రొమారియో షెఫర్డ్ గత ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున అదరగొట్టిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఓ మ్యాచ్ లో 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ తొలి స్థానంలో ఉండగా.. షెఫర్డ్ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. షెఫర్డ్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేిన వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 203 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లూసియా కింగ్స్ జట్టు ప్లేయర్ ద మ్యాచ్ అఖీమ్ అగస్టీ 35 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అఖీమ్ అగస్టీ చెలరేగడంతో 11 బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది లూసియా కింగ్స్ జట్టు.
🚨Romario Shepherd in T20s in 2025🚨
Innings – 32 || Runs – 541 || Avg – 31.82 || SR – 189.82
50s – 3
4s/6s – 39/43Batting wise, this is his best year in T20 cricket 🔥🔥 pic.twitter.com/AIjspyMbPP
— Cricbuzz (@cricbuzz) August 27, 2025