This Hero Joins in Lokesh Kanagaraj LCU: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్ని సూపర్ హిట్. ఆయన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూవీ వస్తుంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అనే మార్క్ ఉంది. ఆయన సినిమాటిక్ యూనివర్సిటీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలు ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇవి ఉన్నాయి. ఇప్పటి వరకు లోకేష్ కెరీర్ లో ప్లాప్ మూవీనే లేదు. రీసెంట్ కూలీతో ఫస్ట్ ఫ్లాప్ చూశాడు.
లోకేష్ నిర్మాతగా బెంజ్
అయితే ఇప్పుడు లోకేష్ నిర్మాతగా తన సినిమాటిక్ యూనివర్సిటీ నుంచి ఓ చిత్రం రాబోతోంది. కొత్త దర్శకులతో బెంజ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రోమియో అండ్ సుల్తాన్ ఫేం బక్కియరాజ్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండగా.. మాధవన్, నవీన్ పౌలి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది.
ఎల్ సీయూలో ఆ స్టార్
ఆయన మరోవెరో కాదు ప్రముఖ నటుడు రవి మోహన్ (జయం రవి). కోలీవుడ్ హీరోగా ఎన్నో సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకున్నాడు. అలాగే పలు చిత్రాల్లోనూ విలన్ గా నటించి మెప్పించాడు. శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తి చిత్రంలో జయం రవి ప్రతికథానాయకుడిగా పాత్రలో కనిపించాడు. ఇందులో అతడి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో బెంజ్ జయం రవి కోసం లోకేష్ కనగరాజ్ మాస్ పాత్రని డిజైన్ చేశాడట. త్వరలోనే ఆయన మూవీ సెట్ లో అడుగుపెట్టబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
కాగా ఇటీవల కూలీ మూవీని తెరకెక్కించిన లోకేష్ నెక్ట్స్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ డెవలప్మెంట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. నిజానికి కూలీ తర్వాత లోకేష్ కార్తితో ఖైదీ 2 చేయాల్సి ఉంది. కానీ, రజనీ కమల్ చిత్రం కోసం ఖైదీ 2 హోల్డ్ లో పెట్టాడు. దీంతో ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చిన కార్తి.. సుందర్ సికి కెటాయించాడట. సుందర్ సితో మూవీకి కమిటై ఆ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. కమల్, రజనీ మూవీ తర్వాత లోకేష్ ఖైదీ 2 చేయనున్నాడట. మరోవైపు లోకేష్ తాను హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు జయం రవి నిర్మాతగానూ కొత్త అడుగులే వేశారు. ఇటీవల తన పేరులో ప్రొడక్షన్ హౌజ్ ని స్థాపించాడు. రవి మోహన్ స్టూడియోస్ పేరు స్థాపించిన ఈ స్టూడియోను రెండు రోజుల క్రితమే ప్రారంభించిన సంగతి తెలిసిందే.