Big Stories

Team India Worst Record: పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా చెత్త రికార్డ్.. అదేంటంటే..?

Team India Worst Record in T20 World Cup Matches: ఏమిటి..? అద్భుతంగా పాకిస్తాన్ పై గెలిచిన టీమ్ ఇండియా ఎకౌంటులోకి చెత్త రికార్డు వచ్చిందా..? అదెలా..? తక్కువ స్కోరు కూడా కాపాడుకుని సూపర్ గా గెలిచింది కదా.. ఏమిటిది..? అని హాశ్చర్యపోతున్నారా..? మీరు ఊహించింది కరెక్టే.. గెలుపుతో పాటు టీ 20 ప్రపంచకప్ లో ఒక చెత్త రికార్డు కూడా వచ్చి చేరింది. అదెలాగంటారా..?

- Advertisement -

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 19 ఓవర్లలో 119 పరుగులకి ఆలౌట్ అయిపోయింది. ఇదే వచ్చిన చెత్త రికార్డు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ చేతిలో తొలిసారి ఆలౌటైంది. అదీకాక ఈ ఫార్మాట్ లో టీమిండియా‌కు ఇది నాలుగో అత్యల్ప స్కోరు గా నిలిచింది.

- Advertisement -

అంతకుముందు టీమ్ ఇండియా చేసిన అత్యల్ప స్కోరులు వరుసగా.. 2016లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 79 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 2021లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. 2009లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తాజాగా 2024లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 119 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

Also Read: ఇండియా-పాక్ మ్యాచ్.. బద్దలైన రికార్డులు..!

భారత్ 119 పరుగులైనా సాధించిందంటే, అది టెయిలెండర్ల కృషి అని చెప్పాలి. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా అర్షదీప్ సింగ్ (9), సిరాజ్ (7) కీలక పరుగులు సాధించారు. వీళ్లు 6 పరుగులు తక్కువ చేసినా, పాకిస్తాన్ 113 పరుగులతో విజయం సాధించేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆఖరి ఓవర్ ముందు రన్ అవుట్ కాకుండా ఉండుంటే, వీళ్లిద్దరూ మరికొన్ని పరుగులు చేసేవారని అంటున్నారు.

న్యూయార్క్ పిచ్ పై ఫస్ట్ బ్యాటింగ్ చేసినవారు 130 పరుగులు చేసినా చాలు, మ్యాచ్ ని కాపాడుకోవచ్చునని మొదటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ అంటూనే ఉన్నాడు. పాకిస్తాన్ పై అదే జరిగింది. మరో 11 పరుగులు తక్కువ కూడా వచ్చాయి. అయినా సరే.. రోహిత్ అన్నట్టే టీమ్ ఇండియా మ్యాచ్ ని కాపాడుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News