BigTV English

OTT Movie : ఆరుగురు అమ్మాయిల అడ్వంచర్… కేవ్ లో కేక పెట్టించే హర్రర్ సీన్స్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : ఆరుగురు అమ్మాయిల అడ్వంచర్… కేవ్ లో కేక పెట్టించే హర్రర్ సీన్స్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : హారర్ సినిమాలను చూసేకొద్దీ చూడాలనిపిస్తుంటాయి. ఈ సినిమాలు ఇచ్చే థ్రిల్లింగ్, వేరే జానర్ సినిమాలను చూసినా రాదు. ఇక్కడ దెయ్యాల గోలతో భయపడటానికే సగం సమయం సరిపోతుంది. ఈ సినిమా ఎప్పుడు అయిపోతుందో అని అనుకుంటాం. కానీ ఎండింగ్ కి వచ్చినప్పుడు అప్పుడే అయిపోయిందా అని నోరెళ్లబెడతాం. మరి ఈ జానర్ మంత్రం అలా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, బైబిల్‌లోని రివిలేషన్ గ్రంథంలో వర్ణించిన గ్రేట్ ట్రిబ్యులేషన్ ఆధారంగా తెరక్కెక్కింది. ఒక చిన్న పట్టణంలో జరిగే భయంకరమైన డెమన్ దాడుల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

ఈ కథ ఒక చిన్న పట్టణంలో జరుగుతుంది. అక్కడ జనం సాధారణ జీవితం గడుపుతుంటారు. కానీ అకస్మాత్తుగా, చీకటి నుండి భయంకరమైన డెమన్ జీవులు బయటకు వచ్చి దాడులు చేయడం మొదలుపెడతాయి. ఈ సినిమా బైబిల్‌లోని రివిలేషన్ గ్రంథంలో చెప్పిన గ్రేట్ ట్రిబ్యులేషన్ సమయాన్ని ఆధారంగా చేసుకుంది. అంటే ప్రపంచంలో అంతిమ రోజులలో జరిగే భయంకర సంఘటనలన్నమాట. ఈ డెమన్స్ నరకం నుండి వస్తాయని, దేవుని కృప లేని వారిని మాత్రమే హింసిస్తాయని సినిమా చూపిస్తుంది. కథలో ఒక కీలక సన్నివేశంలో, రివిలేషన్ 9:1-4 చూపించడం జరుగుతుంది.


ఇక్కడ ఒక దేవదూత నరక ద్వారం తెరవడంతో, మిడతల రూపంలో డెమన్స్ బయటకు వస్తాయని వివరిస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ జీవులు చాలా భయంకరంగా ఉంటాయి. పట్టణంలోని కొందరు వ్యక్తులు,ఈ జీవులను ఎదుర్కోవడంతో పాటు, ఈ దాడుల వెనుక ఉన్న రహస్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు.  కథలో కొంత మంది హీరోలు ఈ డెమన్స్‌తో పోరాడుతూ తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి చివరికి ఈ డెమన్స్ దేవుడి బిడ్డలను వదిలిపెడతాయా ? దేవుడిపై నమ్మకం లేని వాళ్ళని చంపుతాయా ? ప్రపంచ ఎలా అంతం అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

ఎందులో ఉందంటే

‘ది డిసెంట్’ (The Descent) ది మాస్టర్స్ యూనివర్శిటీ నిర్మించిన హారర్-థ్రిల్లర్ చిత్రం. ఇది మాట్ గ్రీన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో డాన్ సాచాఫ్, జామీ అలెగ్జాండర్, జిల్ మాట్సన్-సాచాఫ్, సేథ్ బౌలింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం ట్యూబీ (Tubi) లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈ సినిమా బైబిల్‌లోని కొన్ని బలమైన వాక్యాల ఆధారంగా తెరకెక్కింది.

Read Also : కాబోయే భర్తను వదిలేసి మరో అమ్మాయితో… ఇద్దరమ్మాయిల అరాచకం… ఇండియాలో బ్యాన్ చేసిన మూవీ

Related News

OTT Movie : భర్తనే ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్… కట్టుకున్నోన్ని వదిలేసి ఆటగాడితో… వాడిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : బాబోయ్… ఏకంగా 236 మిలియన్ వ్యూస్… ఓటీటీలో గత్తర లేపుతున్న సినిమా

OTT Movie : ఐఎండీబీలో 9.6 రేటింగ్… వరుసగా 49 మర్దర్లు… మతిపోగోట్టే తమిళ ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్

SU From SO: అప్పుడే ఓటీటీకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్, కామెడీ ‘సు ఫ్రమ్ సో‘.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే

Maaman OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన మామన్.. ఎక్కడంటే?

Big Stories

×