Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే 40 కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Chennai Super Kings vs Mumbai Indians)
మధ్య ఆసక్తికర ఫైట్ జరిగింది. అయితే ఇందులో ఎనిమిది వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ అందుకుంది. ముఖ్యంగా కార్తీక్ శర్మ 54 పరుగులతో రెచ్చిపోయి చెన్నైని విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో అప్పట్లో మహేంద్రసింగ్ ధోని తరహాలోనే గన్ సెలబ్రేషన్స్ ( Kartik Sharma’s Gun celebration ) చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గన్ సెలబ్రేషన్స్ పైన తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) చాలా సీరియస్ అయ్యారు. ఉగ్రవాదుల్లా లాగా ఈ గన్ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకున్నావు ? కొంచమైనా బుద్ధి ఉందా ? అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిని ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేశారు.
Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండగా రొమాన్స్..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైరల్
ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings vs Mumbai Indians) మధ్య ఎంఏ చిదంబరం వేదికగా నిన్న జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 159 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేదించింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే చేజింగ్ చేసే సమయంలో కార్తీక్ శర్మ 40 బంతుల్లో 54 పరుగులు ఇచ్చేశాడు.
ఈ మ్యాచ్ సందర్భంగా అర్థ సెంచరీ నమోదు చేసిన కార్తీక్ శర్మ… గన్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. గతంలో హెవీ జుట్టు ఉన్నప్పుడు మహేంద్రసింగ్ ధోని కూడా తన బ్యాట్ తో గన్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు అతన్ని కాపీ కొడుతూ కార్తీక్ శర్మ కూడా గన్ సెలబ్రేషన్స్ చేసుకొని హాట్ టాపిక్ అయ్యాడు. దీంతో నిన్నటి నుంచి కార్తీక్ శర్మ చేసిన సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. అయితే దీనిపైన పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
గన్ సెలబ్రేషన్స్ చేసుకున్న కార్తీక్ శర్మ పై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. గతంలో ఫర్హాన్ చేస్తే ఐసీసీ యాక్షన్ తీసుకుందని గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఇండియాకు సంబంధించిన బ్యాటర్ కార్తీక్ శర్మ చేస్తే… ఐసీసీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని తన్వీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లను ఉగ్రవాదులతో పోల్చాలని… ఉరి తీయాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==