E-Paper
Advertisement

బాబ‌ర్ ఆజంతో ఇర్ఫాన్ ప‌ఠాన్ సీక్రెట్ మీటింగ్…పాక్ మీడియా సంచ‌ల‌నం?

బాబ‌ర్ ఆజంతో ఇర్ఫాన్ ప‌ఠాన్ సీక్రెట్ మీటింగ్…పాక్ మీడియా సంచ‌ల‌నం?
Advertisement

Irfan Pathan Meets Babar Azam: పాకిస్తాన్ వెధవలు రోజురోజుకు దిగజారిపోతున్నారు. టీమిండియాపై విషం కక్కేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. పొద్దున లేస్తే చాలు… ఇండియాను కించపరిచే పనిలో పడిపోతున్నారు. రాజకీయ నాయకుల నుంచి క్రికెటర్ల వరకు అందరూ ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో తాజాగా పాకిస్తాన్ మీడియా కూడా చేరిపోయింది. పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజంను (Babar Azam) రహస్యంగా టీమిండియా మాజీ ఆల్ రౌండ‌ర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan ) కలిసినట్లు పాకిస్తాన్ మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రచూరించారు. టీవీల్లో కూడా బ్రేకింగ్ ల మీద బ్రేకింగ్ లు వేశారు. ఈ రహస్య మీటింగ్ సందర్భంగా బాబర్ ఆజంను ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేసినట్లు కూడా పేర్కొన్నారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

బాబ‌ర్ ఆజంతో ఇర్ఫాన్ ప‌ఠాన్ సీక్రెట్ మీటింగ్ జ‌రిగిన‌ట్లు వార్త‌లు ?

పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజంను రహస్యంగా కలిశాడని, ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేశాడనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఇర్ఫాన్ పఠాన్ కూడా రియాక్ట్ అయ్యారు. తాను బాబర్ ఆజంను కలిసినట్లుగా పాకిస్తాన్ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇదంతా ఫేక్ ప్రచారమని ఖండించారు. తాను బాబర్ ఆజంను కలవలేదని… అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు తానేమి ప్రయత్నం చేయలేదని వెల్లడించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తాను స్టేట్మెంట్స్ ఇస్తానని.. తన ఇంటర్వ్యూకు బాబర్ ఆజం నో చెప్పినట్లు కూడా విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇర్ఫాన్ పఠాన్. బాబర్ ఆజంను కలిసేందుకు వెళ్తే, తనను గెంటేసారని కూడా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. పాకిస్తాన్ వాడితో త‌న‌కేం అవ‌స‌రం ? ఇలా త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డానికి సిగ్గుగా లేదా ? అంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీమిండియా మాజీ ఆల్ రౌండ‌ర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan ).

Advertisement

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

ఫోటోషాప్ లో నా ఫోటోను ఎడిట్ చేశారు – ఇర్ఫాన్ ప‌ఠాన్

టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజంను ఇంటర్వ్యూ చేసేందుకు తాను వెళ్లానని ప్రచారం చేసిన ఇదే పాకిస్తాన్ మీడియా… అతడు త‌న‌కు ఇంటర్వ్యూ ఇవ్వలేదని ప్రచారం చేసిందని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించారు. పాకిస్తాన్ లో ఉన్న మరో సెక్షన్ మీడియా… తాను బాబర్ ఆజంను ఇంటర్వ్యూ చేసినట్లు కూడా ఫోటోలు వైరల్ చేస్తోందని మండిపడ్డారు. వాస్తవానికి బంగ్లాదేశ్ కు సంబంధించిన ఓ కుర్ర జర్నలిస్టు గతంలో బాబర్ ఆజంను ఇంటర్వ్యూ చేశాడని… అయితే ఆ ఇంటర్వ్యూ తాను చేసినట్లు ఫోటోషాప్ లో ఫోటోలు ఎడిట్ చేసి పెట్టారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఆ కుర్ర జర్నలిస్టు ఫేస్ స్థానంలో తన ఫోటోలు పెట్టి… పాకిస్తాన్ మీడియా కుట్రలకు తెరలేపిందని ఆగ్రహించారు. ఇంత దిగజారడానికి సిగ్గు లేదా ? అంటూ పాకిస్తాన్ మీడియాపై ఫైర్ అయ్యారు.

Advertisement

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

 

Related News

ఆ ఇద్దరూ దరిద్రుల వల్ల, నాకు నిద్ర లేకుండా పోయింది…గంభీర్ కామెంట్స్ వైరల్

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్

Big Stories

Advertisement
×