E-Paper
Advertisement

బిగ్ బాస్ 10లోకి ప్రముఖ గేయ రచయిత్రి?

బిగ్ బాస్ 10లోకి ప్రముఖ గేయ రచయిత్రి?
Advertisement

Bigg Boss 10:ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ సొంతం చేసుకుంటూ.. అన్ని భాషలలో వరుసగా సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ అందరిని అలరిస్తోంది రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తికాగా.. 10వ సీజన్ కి రంగం సిద్ధం అయ్యింది. సామాన్యుల ఎంపిక ప్రక్రియ కోసం ఆగస్టు 15వ తేదీ నుండి జియో హాట్ స్టార్ వేదికగా ‘అగ్నిపరీక్ష’ షో ప్రారంభం కానుంది. మరొకవైపు సెలబ్రిటీలను ఎంపిక చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద ఎత్తున భారీ సెట్ కూడా వేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుండి బిగ్ బాస్ దశావతారం షో ప్రారంభం కాబోతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ 10 లోకి ప్రముఖ గేయ రచయిత్రి..

అంతా సిద్ధమవుతున్న సమయంలో ఇప్పుడు హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎవరెవరు అడుగు పెడుతున్నారు అనే కామెంట్లు సోషల్ మీడియా వేదిక వ్యక్తం అవుతున్నాయి. నిజానికి బిగ్ బాస్ సీజన్ 10 కాబట్టి కేవలం 10 మంది సెలబ్రిటీలను మాత్రమే హౌస్ లోకి తీసుకోవాలని నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై నిజానిజాలు తెలియలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఒక రచయిత్రి పేరు గట్టిగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఈమె ఎవరో కాదు కడలి సత్యనారాయణ (Kadali Sathyanarayana).

పుస్తక రచయిత్రి.. సోషల్ మీడియాలో విపరీత ఆదరణ..

Advertisement

సినీ, టెలివిజన్ ప్రేక్షకులకు పెద్దగా ఈమె గురించి తెలియకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది. ఆధునిక, మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకుంటూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమెకు.. తెలుగు భాష పై అపారమైన అభిమానం ఉంది.బి ముఖ్యంగా తెలుగు భాష గొప్పతనం, ప్రాముఖ్యతను చాటిచెబుతూ పలు రకాల పుస్తకాలను కూడా ఈమె రచించారు. ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ దశావతారంలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు

also read:ప్రభాస్ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ‘దందా’ దొర సాయి తేజ సినీ జర్నీ!

ఎవరీ కడలి సత్యనారాయణ?

Advertisement

సోషల్ మీడియా ద్వారా అపారమైన ఆదరణను సొంతం చేసుకున్న కడలి సత్యనారాయణ ఒక యువ తెలుగు రచయిత్రి కూడా.. అంతేకాదు డైలాగ్స్ కూడా అద్భుతంగా అందిస్తుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జన్మించిన ఈమె సమాజంలో మహిళల పట్ల ఉండే దృక్పథాలను ప్రశ్నిస్తూ.. ఆధునిక ప్రేమకథలు, భావాలతో యువతను ఆకట్టుకునే రచనలు చేస్తోంది. కడలి సత్యనారాయణ తన తాత గారి పేరును తన పేరుకి జోడించుకుంది. ముఖ్యంగా ఈమె లెటర్స్ టు లవ్, చిక్ లిట్ వంటి పుస్తకాలు రచించగా.. ఇవి అటు సోషల్ మీడియాలో, యువతలో చాలా ప్రసిద్ధి పొందాయి.

గేయ రచయితగా కూడా గుర్తింపు..

సినిమా రంగం విషయానికొస్తే.. 2021 లో వచ్చిన అర్థ శతాబ్దం, #మాయా వంటి చిత్రాలకు పాటలతో పాటు డైలాగులు కూడా అందించింది. ఫెమినిజం, ఆధునిక సంబంధాలు, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తపరుస్తూ రచయిత్రిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×