E-Paper
Advertisement

త్వరలో కొత్త పథకాల అమలుకు శ్రీకారం: మంత్రి కోమటి రెడ్డి..!

త్వరలో కొత్త పథకాల అమలుకు శ్రీకారం: మంత్రి కోమటి రెడ్డి..!
Advertisement

Six Guarantees: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలతోపాటు కొత్త పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. 99 రోజుల ప్రణాళికలో అన్ని స్థాయిల్లో సమీక్షలు చేపట్టి సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వపరంగా మధ్యాహ్నం భోజనం అందించనుందని చెప్పారు.

నల్గొండ పట్టణంలో..

ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని రూ. 1400 కోట్లతో అమలు చేయనుందన్నారు. అదే విధంగా రామగిరి టెంపుల్ నుంచి దేవరకొండ రోడ్డు వరకు రూ. 15 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నల్గొండ పట్టణంలో 740 మందికి ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చినట్లు తెలిపారు. జూన్ నుంచి మరో విడత ఇందిర ఇళ్లకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ధాన్యం కొనుగోలులో భాగంగా రైతులకు చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని…దిగుమతుల్లో జాప్యం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Also read: రాంచందర్ రావు బుద్ధి ఉందా.. ఎమ్మెల్యే కుంభం ఫైర్!

5 వేల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన..

నల్గొండ జిల్లా కేంద్రంలోని న్యాక్ కేంద్రంలో శనివారం 124 కంపెనీలతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. సుమారు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుండగా మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల్లో జాబ్ మేళాలను నిర్వహిస్తూ యువతకు భరోసాగా నిలుస్తున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లాలో రైస్ ఇండస్ట్రీస్, సిమెంటు ఫార్మ పరిశ్రమలలో లోకల్ యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈనెల 2వ తారీఖున మొదలైన జాబ్ మేళా ఈనెల 3న ఆదివారం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు.

ఫార్మా కంపెనీలు నిబంధన ప్రకారం..

Advertisement

ఉద్యోగం ఎంత చిన్నదైనా జాబ్ లో చేరితే ఉద్యోగపరంగా అనుభవంతో పాటు ఆర్థిక లావాదేవీలపై అవగాహన పెరుగుతుందన్నారు. చదువు పూర్తి కాగానే ఉద్యోగాలను చేరేందుకు యువత ఆసక్తి చూపాలన్నారు. ఫార్మా కంపెనీలు నిబంధన ప్రకారం నడిపిస్తూ ప్రమాదాలను జరగకుండా చూసుకోవాలన్నారు. కంపెనీల నిర్వహణను నిర్లక్ష్యం చేసి ప్రమాదాలు జరిగితే కంపెనీల లైసెన్స్ రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.

Also read: హైదరాబాద్ నివాసంలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×