BigTV English
Advertisement

Trolls on RCB : RCB పై పాకిస్తాన్ కుట్రలు… ఈ సారి కప్పు గెలుస్తుంది అనుకుంటే… ఐపీఎల్ 2025 రద్దు అయ్యేలా ఉందే ?

Trolls on RCB : RCB పై పాకిస్తాన్  కుట్రలు… ఈ సారి కప్పు గెలుస్తుంది అనుకుంటే… ఐపీఎల్ 2025 రద్దు అయ్యేలా ఉందే ?

Trolls on RCB : ఐపీఎల్ సీజన్ 18వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాస్త ముందంజలో కొనసాగుతోంది. అయితే ఈసారి కప్ ఆర్సీబీదేనని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని మ్యాచ్ ల్లో అయితే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని.. అందుకే ఆర్సీబీ విజయం సాధిస్తుందనేలా మాట్లాడుకుంటున్నారు. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సులువుగా గెలవాల్సిన చెన్నై జట్టు చివర్లో కీలక వికెట్లను కోల్పోయి మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ భారత్ పై దాడి చేస్తుంటే.. భారత్ తిప్పి కొడుతోంది. ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేస్తోంది భారత్. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్ రద్దు అవుతుందనే వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం ఐపీఎల్ రద్దు కావడం లేదని స్పష్టం చేసింది.


Also Read : Retirement @ 7:29 PM : ధోని అంటే ఇంత అభిమానమా.. రోహిత్ రిటైర్మెంట్ లోనూ ఫాలో అయిపోయాడు

అయితే నిన్న జరగాల్సిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దు అయింది. దీంతో అటు ఢిల్లీకి ఇటు పంజాబ్ కి ఇది కీలక మ్యాచ్ కావడంతో రెండు జట్లు కాస్త నిరాశకు గురయ్యాయి. ఈ మ్యాచ్ మళ్లీ నిర్వహిస్తారా..? లేక స్కోర్ ని షేర్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్  గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు ప్లే ఆఫ్ లోకి కూడా బెంగళూరు వెళ్ళింది. కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే.. ఐపీఎల్ టోర్నమెంట్ రద్దయ్య ప్రమాదం పొంచి ఉంది.  అంటే ఈసారి కూడా బెంగళూరుకు కప్పు రాదన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.


ఈ సీజన్ లో ఆర్సీబీ జట్టు అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ రెండింటిలో రాణిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 మ్యాచ్ లు ఆడితే 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో తలపడనుంది. అయితే ఆర్సీబీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జట్టు కి ప్రధాన బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లకు దూరం కానున్నాడు. గాయం కారణంగా అతను ఆటకు దూరం కావాలసి వచ్చింది. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆర్సీబీ మయాంక్ అగర్వాల్ ను జట్టులోకి తీసుకుంది. మయాంక్ ని కోటీ రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సీజన్ లో పడిక్కల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక మయాంక్ అగర్వాల్ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నాడు. పడిక్కల్ స్థానాన్ని మయాంక్ అగర్వాల్ భరిస్తారా లేదా అనేది ప్రస్తుతం అనిశ్చితంగా ఉంది. ఎందుకంటే గత సీజన్లలో అంతగా రాణించలేదు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వంటి అనుభవజ్ఞుల సమక్షంలో మయాంక్ మెరుగ్గా ఆడితే ఆర్సీబీకి ఇక తిరుగుండదు. ప్రస్తుతం ఆర్సీబీకి ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. ఇప్పటికే 16 పాయింట్లు సాధించినప్పటికీ ప్లే ఆప్స్ లో టాప్ లో ఉండాలంటే విజయం సాధించాలి. 

?igsh=MW8wY282N2Z0b2tidA==

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×