Illu Illalu Pillalu Today Episode may 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి అమృతను చదవకుండా డుమ్మా కొట్టేస్తున్నావా నాలుగు రోజులు ఎంజాయ్ చేసావుగా ఇప్పుడు బాగా చదవాలి.. ఈసారి ఎగ్జామ్స్ లో మార్కులు తక్కువ వచ్చాయనుకో నీ పని ఉంటుంది అని అమృతకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి అక్కడికి వచ్చి అత్తయ్య గారండి అందరికీ చపాతీ కూర చేద్దామని అనుకుంటున్నాను మీరు ఒక మాట చెప్తే ఏమంటారు అని వచ్చాను అని అంటుంది. ఏంటి అందరికీ చపాతి చేస్తావా అని వేదవతి షాక్ అవుతుంది. అయ్య బాబోయ్ నేనేంటి మర్డర్ చేస్తారా అన్నట్టు అడిగారు చపాతినే కదా అనని అంటుంది శ్రీవల్లి. నర్మద వేదవతికి బజ్జీలు తెస్తుంది.
మీకు బజ్జీలు అంటే చాలా ఇష్టం కదా అందుకే నేను మీకోసం ఈరోజు బజ్జీలు తీసుకొచ్చాను అని ఇస్తుంది వాటిని చూడగానే వేదవతికి నోట్లో నీళ్లు ఊరతాయి. ఎంతో ఆశగా తినబోతూ ఉంటుంది. శ్రీవల్లి మాత్రం వాటిని ఎటువంటి ఆయిల్లో వేశారో?ఎక్కడ ఆయిల్లో వేసారో? ఎవరికి తెలుసు అలాంటివి తింటే ఆరోగ్యం పాడవుతుంది అని ఆ బజ్జీలను తీసుకెళ్లి బయట పడేస్తుంది. అది చూసి వేదవతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా ప్రేమ ఇద్దరూ శ్రీవల్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నర్మదా అత్తయ్యకు ప్రేమతో బజ్జీలు తెస్తే ఎటువంటి ఆయిల్లో వేసారు అంటూ పెద్ద క్లాసులు పీకింది. అప్పటి నుంచి ఆవిడ ఏదో బజ్జీలు తిననట్టు ఇంతగా ఆలోచిస్తుందంటే అని నర్మదా సీరియస్ అవుతుంది. ఇక ప్రేమ కూడా ధీరజ్ని మావయ్య తిట్టిన విషయాన్ని నర్మదతో చెప్తుంది.. మావయ్య తన కొడుకుని తిట్టొచ్చు కొట్టొచ్చు అయినా ఈవిడకెందుకు పళ్ళు ఇక్కిలిచ్చి నవ్విందని ప్రేమ అంటుంది.
చూస్తుంటే ఆవిడ రోజుకి మన మీద కూడా పెత్తనం ఎలా చూస్తుంది అని నర్మదా అంటుంది.. అవునక్కా నిజంగానే అలానే అనిపిస్తుంది ఎలాగైనా ఆవిడ పొగడ్ని అణిచివేయాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వేదవతి అక్కడికి వచ్చి ఏంటి తోడికోడలు ఇద్దరు ఏదో గుడుపుటాని చేస్తున్నారు అని అడుగుతుంది. మీ పెద్ద కోడలు అలా బజ్జీలు విసిరేయడం ఏమైనా బాగుందా చెప్పండి అని నర్మదా సీరియస్ అవుతుంది. అది తప్పే కానీ నా ఆరోగ్యం కోసం చేశానని చెప్పింది కదా ఇక దాని గురించి వదిలేయచ్చు కదా అని వేదవతి ఇద్దరు కోడళ్ల తో అంటుంది..
ఏంటి గవర్నమెంట్ కోడలు గారు మీరు ఇన్ని రోజులు సైలెంట్ అనుకున్నాను నాకన్నా గడుసు లాగా ఉన్నారే అని వేదవతి అంటుంది. నేను పైకి గడుపుదానిలాగే కనిపిస్తాను లోపల మాత్రం వట్టి పిరికిదాన్నే ఇది మీరు నమ్మాలి అని వేదవతి ఇద్దరి కోడలతో అంటుంది. నర్మద మాత్రం మీ పెద్ద కోడలికి చెప్పండి ప్రతి విషయంలోనూ మా మధ్యలో వేలు పెట్టాలని చూడొద్దు. ఆమె పని ఏంటో ఆమె చేసుకోమనండి మా గురించి మాకు తెలుసు అని వార్నింగ్ ఇస్తుంది.
ధీరజ్ ప్రేమ కోసం డ్రెస్ ని ప్రేమగా కొని తీసుకుని వస్తాడు. ఇప్పుడే డ్రెస్ ని ప్రేమకిస్తే నాకోసం నువ్వు ఎందుకు తెచ్చావు అని రాక్షసి లాగా మీద పడుతుంది. ఇప్పుడు అంత ఓపిక లేదు ముందు వెళ్లి స్నానం చేయాలి అని వెళ్తాడు. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ డ్రెస్ ఉండదు ప్రేమ ఆ డ్రెస్ ని వేసుకోవడం చూసి సంతోష్ పడతాడు. అయితే ప్రేమ నా సైజు నీకు ఎలా తెలుసురా ఇంత కరెక్ట్ గా నాకు డ్రెస్సులు తీసుకొచ్చావు అని అంటుంది. రోజు చూస్తున్నాను కదా అని అనగానే ప్రేమ కోపంతో ధీరజ్ పై పెద్ద యుద్ధమే చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కాసేపు గొడవలు కాసేపు గిల్లికజ్జాలు ఉంటాయి.
సాగర్ నర్మద దగ్గరకొచ్చి సారీ నర్మదా అని చెప్తాడు. నర్మదా సారీ ఎందుకు చెప్తున్నారు అని అడుగుతుంది. నేను రెస్టారెంట్లో బిల్లు కట్టలేదు కదా అందుకు నువ్వు ఫీల్ అయ్యావ్ ఏమో అని సారీ చెప్పానని అంటాడు. రెస్టారెంట్లు బిల్లు కట్టనందుకు నేను ఫీల్ అవ్వలేదు రెస్టారెంట్ బయట ఒక అనాధ లాగా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు చూడు.. అది నాకు బాధగా అనిపించింది అని నర్మద అంటుంది. భార్యను రెస్టారెంట్ కి తీసుకెళ్లాలని తండ్రితో ధైర్యంగా చెప్పలేవు.. ఒక 1000 రూపాయలు కూడా అడిగి తీసుకురాలేవు నువ్వే మనిషివి రేపు కాపురం చేయాలన్నా మీ నాన్నను అడిగే కాపురం చేస్తావని నర్మదా సీరియస్ అవుతుంది. సాగర్ కూడా సీరియస్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శ్రీవల్లి ఇంట్లో చిచ్చు పెట్టేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..