BigTV English

Retirement @ 7:29 PM : ధోని అంటే ఇంత అభిమానమా.. రోహిత్ రిటైర్మెంట్ లోనూ ఫాలో అయిపోయాడు

Retirement @ 7:29 PM : ధోని అంటే ఇంత అభిమానమా.. రోహిత్ రిటైర్మెంట్ లోనూ ఫాలో అయిపోయాడు

Retirement @ 7:29 PM : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కి గుడ్ బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు అభిమానులకు షాక్ చేశాడు. గత కొన్ని రోజులుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న హిట్‌మ్యాన్.. ఆ పార్మాట్‌ మొత్తానికి గుడ్‌బై చెప్పాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతునానని ప్రకటించాడు. అయితే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌ రిటైర్మెంట్‌కు.. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ రిటైర్మెంట్‌కు కొన్ని పోలికలు ఉన్నాయి. వీరిద్దరూ అనుకోకుండానే కొన్ని విషయాల్లో ఒకరినొకరు ఫాలో అయ్యారు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని 2020 ఆగస్టు 15 రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక రోహిత్ శర్మ కూడా 2025 మే 7 రాత్రి 7.29 గంటలకు తన టెస్టు ఫార్మాట్ రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ మొత్తానికి.. రోహిత్ టెస్టు ఫార్మాట్‌కు ఒకే సమయంలో వీడ్కోలు పలికినట్లయింది.


Also Read : PSL 2025: మోడీ దెబ్బ అదుర్స్..విదేశాలకు PSL 2025 టోర్నమెంట్.. ఎక్కడంటే ?

మరోవైపు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలు స్వదేశంలో ఒకే వేదికపై చివరి టెస్టు మ్యాచ్ ఆడారు. వీరిద్దరూ ముంబైలోని వాంఖడేలో ఈ మ్యాచ్ ఆడారు. అటు విదేశాల్లోనూ ఈ రికార్డు సమానంగా ఉంది. ఎందుకుంటే ఇద్దరూ కూడా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్ స్టేడియంలోనే తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడటం గమనార్హం. ధోనీ 2014లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఇతర ఫార్మాట్‌లలో మాత్రం జట్టుకు సారథిగా కొనసాగాడు. రోహిత్ శర్మ కూడా.. భారత వన్డే జట్టును నడిపించనున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా టెస్టులకు సైతం దూరమయ్యాడు. తన కెరీర్‌లో తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉన్న రోహిత్.. 2027 వన్డే ప్రపంచకప్ వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలని భావిస్తున్నాడు.


టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్ మెంట్ తీసుకున్నాడనే వార్త తెలియగానే ధోనీ షాక్ కి గురయ్యాడు. అసలు రోహిత్ శర్మ ఉన్నట్టుండి ఇలా చేశాడు ఏంటి..? అని ఆశ్యర్యపోయాడట. ఇక రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. 2023 వరకు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా కొనసాగాడు. 2024 తరువాత హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడి ముంబై విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే చెన్నై ఈ సీజన్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. పాయింట్ల పట్టిక లో చిట్ట చివరి స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ ప్లే ఆప్స్ కి వెళ్లకుండానే ఇంటి బాట పట్టనుంది చెన్నై. మరోవైపు ధోని ఐపీఎల్ కి ఈ సీజన్ మాత్రమే చివరిదని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ని ప్రతీ విషయంలో ఫాలో అవుతూ వస్తున్నాడు రోహిత్ శర్మ.

?igsh=bWtyNmExZzA2M3pq

 

?igsh=eG93Znk3YXlzcXow

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×