Urvil Patel: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే యాభై కి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇక ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Chennai Super Kings vs Lucknow Super Giants) మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ఎంఏ చిదంబరం స్టేడియం (MA Chidambaram Stadium, Chennai ) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం దిశగా దూసుకు వెళ్తోంది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఉర్విల్ పటేల్ (Urvil Patel) సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసి సంచలనం చేశాడు.
చెన్నై చెపాక్ వేదికగా లక్నో వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో చేజింగ్ చేస్తున్న ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఇందులో ఏడు సిక్సర్లు అలాగే ఒక బౌండరీ కూడా ఉంది. ఈ అర్థ సెంచరీ తో ఉర్విల్ పటేల్… యశస్వి జైస్వాల్ రికార్డును సమం చేశాడు. గతంలో యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఇక లేటెస్ట్ గా ఉర్విల్ పటేల్ కూడా ఈ రికార్డు చేయడం జరిగింది. దీంతో ఉర్విల్ పటేల్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అటు అర్ధ సెంచరీ నమోదు చేసిన తర్వాత తన జేబులో నుంచి కాగితపు ముక్కను తీసి అందరికి చూపించాడు. తన ఇన్నింగ్స్ ఫాదర్ కు అంకితం చేస్తున్నట్లు ఇందులో (This is for you PaPa) రాసి పెట్టాడు. ఆ తర్వాత ఆ పేపర్ కు కిస్ ఇచ్చి లోపల మడిచి పెట్టుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) ఇప్పటివరకు ఫాస్టెస్ట్ 50 చేసిన ప్లేయర్ల లిస్టు చూస్తే… యశస్వి జైస్వాల్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2023 ఐపీఎల్ లో కేకేఆర్ పైన 13 బంతులలో అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఉర్విల్ పటేల్ ఇవాళ లక్నో పైన 13 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కె.ఎల్ రాహుల్ 14 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేయగా, ప్యాట్ కమిన్స్ 14, షెఫర్డ్ 14 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసుకున్నారు.
Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువరాజ్ రొమాన్స్..ఇంతకు ఎవరీ నవ్య నాయర్ ?
Urvil Patel has become the joint-fastest batter to score a fifty in IPL history!
– He also holds the joint second-fastest hundred in men’s T20 cricket. pic.twitter.com/nQUUEJ97H2
— Vipin Tiwari (@Vipintiwari952) May 10, 2026