Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో సిక్సర్లు లేదా బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. బుమ్రా, భువనేశ్వర్, హెజెల్ వుడ్, కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి ఎంతో మంది వరల్డ్ క్లాసు బౌలర్లకు కూడా చుక్కలు చూపించాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అంతేకాదు ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్ లలో 579 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతున్నాడు. అయితే అలాంటి వైభవ్ సూర్య వంశీ తన లైఫ్ టైం డ్రీమ్ బయట పెట్టాడు. పాకిస్తాన్ పైన ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతానని శపథం చేశాడు. దీంతో 15 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)… పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. త్వరలోనే టీమ్ ఇండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటానని, ఆ తర్వాత పాకిస్తాన్ జట్టును చీల్చి చెండాడుతానని వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతానని కూడా డేంజర్ బెల్స్ పంపించాడు. ఇది తన లైఫ్ టైం డ్రీమ్ అంటూ ప్రకటన చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఇది అతి త్వరలోనే జరగనుందని కూడా చెప్పుకొచ్చాడు. ఆరు నూరైనా పాకిస్తాన్ పైన తాను ఆడి ఆరు సిక్సర్లు కొడతానని వార్నింగ్ ఇచ్చాడు వైభవ్. దీంతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చేసిన వార్నింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. అతని వయస్సుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ వయస్సు 15 సంవత్సరాలు కాదని.. కచ్చితంగా 24 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటాడని తన్వీర్ అహ్మద్, షోయబ్ అక్తర్, ఇంజమామ్ ఉల్ హక్ లాంటి క్రికెటర్లు ఆరోపణలు చేస్తున్నారు. వెంటనే వైభవ్ కు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. అతనికి డిఎన్ఏ పరీక్షలు చేస్తేనే అసలు విషయం బయట పడుతుందని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐసీసీ కి కూడా లేఖ రాస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో వైభవ్ సూర్య వంశీ వాడే బ్యాటలో చిప్స్ పెట్టారని కూడా ఆరోపణలు చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.