E-Paper
Advertisement

Inzamam-ul-Haq: బంగ్లా బౌల‌ర్ల‌ దెబ్బ‌కు పాకిస్తాన్ ఆటగాళ్లకు 140 డిగ్రీల జ్వరం వచ్చింది

Inzamam-ul-Haq: బంగ్లా బౌల‌ర్ల‌ దెబ్బ‌కు పాకిస్తాన్ ఆటగాళ్లకు 140 డిగ్రీల జ్వరం వచ్చింది
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఒకవైపు రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్… పాకిస్తాన్ జట్టును వైట్ వాష్ చేసింది. రెండు టెస్టుల్లో కూడా పాకిస్తాన్ జట్టును దారుణంగా ఓడించింది బంగ్లాదేశ్. ఈ క్రమంలో స్వదేశంలో పాకిస్తాన్ ను వైట్ వాష్ చేసి సిరీస్ గెలిచిన రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పుమంటున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లే ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

పాకిస్తాన్ ఆటగాళ్లకు 140 డిగ్రీల జ్వరం వచ్చింది – ఇంజమామ్

Advertisement

బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ జట్టు పైన మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లను చూసి పాకిస్తాన్ ఆటగాళ్లు గజ గజ వణికి పోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ ఆటగాళ్లకు 140 డిగ్రీల జ్వరం వచ్చిందని కూడా బాంబు పేల్చారు. అర్ధరాత్రి కూడా బంగ్లా బౌలర్లను చూసి, నిద్ర పోలేదని కూడా ఆరోపణలు చేశారు. ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదని మండిపడ్డారు. పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ చెత్త నిర్ణయాల వల్ల దారుణంగా ఓటమి పాలయ్యారని సీరియస్ అయ్యారు. అతనికి కెప్టెన్సీ ఇవ్వడమే పెద్ద తప్పిదమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహమ్మద్ రిజ్వాన్ ఎందుకు వికెట్ కీపింగ్ చేస్తున్నాడో అర్థం కావడం లేదని సీరియస్ అయ్యారు. ఒక్కడంటే ఒక్కడు కూడా జట్టులో రాణించలేదని మండిపడ్డారు. వెంటనే షాన్ మసూద్ పైన వేటు వేసి బాబర్ ఆజం కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే పాకిస్తాన్ మళ్లీ గాడిలో పడుతుందని తెలిపారు.

పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై షోయబ్ అక్తర్, త‌న్వీర్ అహ్మ‌ద్ సీరియస్

బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు పైన మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చాలా సీరియస్ అయ్యారు. తనకు డబ్బులు వస్తున్నాయని మ్యాచ్ చూస్తున్నాను కానీ… పాకిస్తాన్ ఆడే ఏ ఒక్క మ్యాచ్ కూడా తాను చూడబోనని వివరించారు. ఇకపైన పాకిస్తాన్ ఆడే ఏ ఒక్క మ్యాచ్ చూడబోడని శపథం చేశారు. అటు మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ కూడా ఇదే స్థాయిలో రెచ్చిపోయారు. పాకిస్తాన్ జట్టులో ఉన్న 11 మంది… కెప్టెన్సీ కోసం కొట్టుకుంటున్నారని చురకలు అంటించారు. షాన్ మసూద్ ను విలన్ చేసి కెప్టెన్సీ సీట్లు కూర్చోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ గెలిచేసిందని వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×