Kavitha: బీఆర్ఎస్‌లో ఇంకా లుకలుకలు కంటిన్యూ అవుతున్నాయా? ఎందుకు ఆ పార్టీపై మరోసారి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు? కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్. కవితను సస్పెండ్ చేసే విషయంలో ఆ పార్టీ ఆలోచించలేదా? కొందరు నేతల ఆలోచనతో ఏకీభవించి ఆమెపై పార్టీ హైకమాండ్ వేటు వేసిందా? ఇలాంటి విషయాలపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.
పాలిటిక్స్ ‘వర్సెస్’ పర్సనల్ కవిత లేటెస్ట్ కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పట్టారు. ఆదివారం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు ఆమె. బీఆర్ఎస్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు.
బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తనపై ఆంక్షలు పెట్టారని, ప్రోటోకాల్ నిబంధన పేరుతో తనను కట్టేశారని ఆవేదన బయటపెట్టారు. అందుకే జనంలో తిరగలేక పోయానని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, ముఖ్యమంత్రి కూతురుగా తన పనులు కాలేదన్నారు. ఎయిడెడ్ కాలేజీ అనుమతి కోసం ఏడాదిగా తిరిగానని గుర్తు చేశారు. ఇలాంటి కారణాల నేపథ్యంలో తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని వాపోయారు.
ఆ పార్టీతో చర్చల్లేవు, చర్చించడాలు లేవ్
ప్రెంచ్ విప్లవం.. నియంతృత్వాన్ని పడగొట్టిందని, తెలంగాణలో కూడా ఆత్మగౌరవం కోసం జాగృతి పోరాడుతుందన్నారు. ఇకపై పాలిటిక్స్ పక్కా చేస్తానని, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని కాసింత గంభీరంగా చెప్పుకొచ్చారు. అందుకు ఇంకా సమయం ఉందని, ప్రస్తుతం ప్రజా సమస్యలపైనే తన పోరాటం ఉంటుందన్నారు.
చివరి ఏడాది మాత్రమే రాజకీయాలని, మిగతా నాలుగేళ్లు అభివృద్ది జరగాలన్నారు. కేసీఆర్.. తండ్రిగా తనను పిలిస్తే ఇంటికి వెళ్తానని అన్నారు. ఇక రాజకీయంగా మాట్లాడే పరిస్థితి లేదని తేల్చేశారు. పార్టీ నుంచి తనను చాలా అవమానకరంగా బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి వేసే ముందు ఖైదీని చివరి కోరిక అడుగుతారని, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసేముందు కనీసం షోకాజు నోటీసు కూడా ఇవ్వలేదన్నారు.
ALSO READ: కేటీఆర్‌ను శ్రీలీల ఐటెం సాంగ్‌తో పోల్చి, పరువు తీసిన సీఎం రేవంత్
తాను తెలంగాణ బిడ్డనేనని, ఆకలినైనా తట్టుకుంటాను కానీ, అవమానాన్ని మాత్రం తట్టుకోనన్నారు. విప్లవాత్మక మార్పు జరిగినప్పుడు కొంతమంది నష్టం జరగవచ్చన్నారు. తనను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల కోసం పని చేయాలని డిసైడ్ అయినట్టు చెప్పారు. కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని, తనలో ప్రశ్నించే తత్వం మారలేదన్నారు.
ఇవాళ రాష్ట్రంలో పాలక పక్షం-ప్రతిపక్షం జూబ్లీహిల్స్ బైపోల్‌లో బిజీగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ అనేది చిన్న ఎన్నిక మాత్రమేనని, అందులో మాకు ఏ స్టాండ్ లేదన్నారు. తెలంగాణ వ్యక్తులు రాజులకు, రాజ్యాలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. నాకు తెలిసి రెండే కులాలు ఉన్నాయని, పైసలు ఉన్న కులం, లేని కులమని చెప్పారు. పైసలు ఉంటే కులం అడగకుండా ఫైవ్ స్టార్ రేంజ్ లో మర్యాద ఇస్తారని గుర్తు చేశారు.
పైసలు ఉంటే ఆటోమేటిక్ గా ఆత్మగౌరవం వస్తుందన్నారు. కానీ ఆ డబ్బు ఎలా రావాలి? తెలంగాణ కూడా ధనిక రాష్ట్రం అని అంటారని, కానీ తెలంగాణలో అందరి వద్ద డబ్బు లేదన్నారు. ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వాతంత్రం కావాలని, రిజర్వేషన్లతో అవకాశాలు కాకుండా అందరికీ సమానంగా అవకాశాలు రావాలన్నారు. ముఖ్యంగా మహిళలు, పొలిటికల్ గా బ్యాక్ గ్రౌండ్ లేని వారికి రాజకీయ అవకాశాలు రావాలన్నారు.
బీఆర్ఎస్ పై కవిత సంచలన కామెంట్స్..
పార్టీ నుంచి నన్ను చాలా అవమానకరంగా బయటకు పంపారు
ఉరి వేసే ఖైదీనైనా చివరి కోరిక అడుగుతారు
కానీ నాకు షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారు
కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తాను
కానీ బీఆర్ఎస్ కు నాకు సంబంధం లేదు
– కవిత pic.twitter.com/Wd5Pyma1dz
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2025