Kadak Singh Review : బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠీ నటించిన థ్రిల్లర్ మూవీ ‘కడక్ సింగ్’. ఈ సినిమాకు అనిరుద్ధ రాయ్ చౌదరి దర్శకత్వం వహించగా.. సంజనా సంఘి, పార్వతి తిరువోతు, జయ ఎహసాన్, జోగి మలాంగ్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ డిసెంబర్ 8 నుంచే జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ
ఏకే శ్రీవాస్తవ అలియాస్ కడక్ సింగ్(పంకజ్ త్రిపాఠి) ఆర్థిక నేరాల డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్. ఓ ఆర్థిక కుంభకోణంలో ఇరుక్కుపోయి సూసైడ్‌కు ప్రయత్నిస్తాడు. మృత్యువు నుంచి తప్పించుకుని.. గతం మర్చిపోతాడు. గతం గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. మరి గతం గుర్తుకు వచ్చిందా? అసలు శ్రీవాస్తవకు కడక్ సింగ్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆర్థిక కుంభకోణం గుట్టు రట్టు చేశాడా? వంటివి తెలియాలంటే కడక్ సింగ్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
కడక సింగ్ ఓ మంచి థ్రిల్లర్ మూవీ. పిల్లలతో కఠినంగా వ్యవహరించే తండ్రి పాత్రలో పంకజ్ త్రిపాఠి అద్భుతంగా నటించాడు. గతం మర్చిపోయిన వ్యక్తికి గతం ఎలా గుర్తు చేయవచ్చో బాగా చూపించారు. కానీ, ఈ సినిమాకు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉన్నా.. విలన్ ఎవరు అన్నది సులభంగా గెస్ చేసేలా ఉండటం కొంచెం మైనస్. మొత్తంగా ఈ థ్రిల్లర్ సినిమాను వీకెండ్‌లో ఒకసారి చూడొచ్చు.