Helicopter Crash: రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని కాస్పియన్ సముద్ర తీరంలో రష్యాకు చెందిన KA-226 హెలికాప్టర్ కుప్పకూలింది. తోక భాగం విరిగిపోవడంతో అదుపు తప్పి గాలిలో గిర్రున తిరుగుతూ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైలట్‌తో సహా నలుగురు క్లిజియార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ ఉద్యోగులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. రష్యా యొక్క ఉత్తర కాకేషస్ ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ డాగెస్తాన్‌లోని కాస్పియన్ సముద్ర తీరంలో నిన్న ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రష్యా తయారీ కంపెనీ కామోవ్ డిజైన్ చేసిన KA-226 లైట్ యూటిలిటీ హెలికాప్టర్ కుప్పకూలి, ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ హెలికాప్టర్ కిజ్లియార్ నుంచి ఇజ్బర్‌బాష్‌కు వెళ్తుండగా, కరబుదాఖ్కెంట్ జిల్లా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
అయితే హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగిరిపోతూ కాస్పియన్ సముద్రంపై తొలగిస్తుండగా, అదుపు తప్పింది. పైలట్ బీచ్‌పై ఎక్స్‌జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, తోక రోటర్ భూమికి తగిలి విరిగిపోయింది. దీంతో హెలికాప్టర్ అదుపు తప్పి గాలిలో గిర్రున తిరిగి కుప్పకూలింది.
Also Read: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు
ఈ హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు కిజ్లియార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ ఉద్యోగులు, ఒకరు ఫ్లైట్ మెకానిక్. అయితే గాయపడిన ఇద్దరు KEMZ ఉద్యోగులు, వారు డెర్బెంట్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్..
రష్యాలో ఘటన
యుద్ధ విమానాల కోసం విడిభాగాలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ నుంచి డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్, చీఫ్ డిజైనర్‌ను తీసుకెళ్తుండగా ప్రమాదం
ప్రమాదంలో నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు pic.twitter.com/urUM3QPTfR
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2025