IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ప్రారంభం కాకముందే కాక మొదలైంది. నవంబర్ 15వ తేదీన రిటైన్ లిస్ట్ ను ప్రకటించాలని 10 ఫ్రాంచైజీ లకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో జట్లు అన్ని అదే పని పైన ఉన్నాయి. ఏ ప్లేయర్ ను వేలంలోకి వదలాలి? ఎవరిని రిటైన్ చేసుకోవాలి అనే దాని పైన కసరతులు మొదలుపెట్టాయి 10 ఫ్రాంచైజీలు. నవంబర్ 15వ తేదీకి కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ సంచలన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ రాయల్స్ లోకి రవీంద్ర జడేజా ( Ravindra Jadeja) వెళ్తున్నాడని, సంజు శాంసన్ (Sanju Samson ) చెన్నై సూపర్ కింగ్స్ కు ట్రేడ్ ప్రక్రియ ద్వారా వస్తున్నాడని న్యూస్ వైరల్ గా మారింది.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మినీ వేలం కంటే ముందు రిటైన్ ప్రక్రియ పాటు ట్రేడ్ ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ నేపథ్యంలో ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజాను తీసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నాలు చేస్తుండట. అదే సమయంలో సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) ఆశ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేంద్రసింగ్ ధోని వచ్చే సీజన్ తర్వాత ఆడకపోవచ్చు. అందుకే ధోని తరహాలో వికెట్ కీపర్, కెప్టెన్ గా పనికి వచ్చే సంజు శాంసన్ ను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ మంతనాలు జరుపుతుందట.
దాదాపు రవీంద్ర జడేజా అలాగే సంజు శాంసన్ ఇద్దరు 18 కోట్ల విలువైన ప్లేయర్లు. ట్రేడింగ్ ద్వారా ఈ ఇద్దరినీ ఎక్స్చేంజ్ చేసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన బ్రేవిస్ ను ( Dewald Brevis ) కూడా కొనుగోలు చేసేందుకు రాజస్థాన్ రాయల్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రవీంద్ర జడేజా ఇనిస్టా అకౌంట్ పని చేయడం లేదు. దీంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. రవీంద్ర జడేజాను వదిలేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కుట్రలు చేస్తున్న క్రమంలోనే, జడేజా తన అకౌంట్ బ్యాక్ చేసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
🚨 RR WANTS JADEJA & BREVIS IN TRADE OF SAMSON 🚨
– Ravindra Jadeja & Sanju Samson are 18 Crores players & deal could well have been sealed by now but Rajasthan Royals are not yet agreeable, RR are believed to be insisting on inclusion of Dewald Brevis in this trade. (Cricbuzz). pic.twitter.com/NPOA1Dd3Vf
— Tanuj (@ImTanujSingh) November 9, 2025