BigTV English

ACB Raids On Uma Maheshwar Rao: ఉమామహేశ్వరా.. ఏంటిది?

ACB Raids On Uma Maheshwar Rao: ఉమామహేశ్వరా.. ఏంటిది?

ACB raids on ACP Uma Maheshwar Rao(Telangana news):

ఉమామహేశ్వరరావు.. సీసీఎస్‌ ఏసీపీ.. ప్రస్తుతం ఆయనపై యాంటీ కరెప్షన్ బ్యూరో ఫోకస్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నారనే ఆరోపణలో రెయిడ్స్ చేసింది. బట్ ఏసీబీ ఆయనపైనే ఫోకస్ చేయడానికి రీజన్సేంటి? ఇంతకీ ఆయన చరిత్రేంటి?


తెలంగాణలో ఏసీబీ ఫుల్‌ ఫైర్‌లో ఉంది. లంచం అన్న పదం వినిపిస్తే చాలు.. బెండు తీస్తోంది. రోజుకు కొందరిని పట్టుకుంటూ.. బెండు తీస్తోంది. అదే స్పీడ్‌లో ప్రస్తుతం ఏసీపీ ఉమా మహేశ్వర్‌ రావుపై ఫోకస్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో.. పలు చోట్ల సోదాలు నిర్వహించింది ఏసీబీ.. ఆయన ఇళ్లు.. ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించింది. నాట్‌ ఓన్లీ తెలంగాణ.. ఏపీలోని వైజాగ్‌లో ఉంటున్న ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా ఎట్‌ ఏ టైమ్ రెయిడ్స్ చేసింది ఏసీబీ..

నిజానికి ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు మొదటి నుంచే కొంచెం కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అని ప్రచారం ఉంది. ఆయనపై పలు ఆరోపణలున్నాయి. రెండు సార్లు సస్పెండ్ అయ్యాడు. ఆబిడ్స్ సీఐ గా ఉన్న సమయంలో లేడీ కానిస్టేబుల్ పట్ల దురుసుగా మాట్లాడి ఓసారి సస్పెండయ్యాడు. జవహర్ నగర్ SHOగా ఉన్నప్పడు ఓ దొంగతనం కేసులో బాధిత లేడీ ఇంట్లో మంచంపై కాలు పెట్టి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ఆ ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఆయన ప్రవర్తనపై ఉన్నతాధికారులు ఫైరయ్యారు. సో మరోసారి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత విధుల్లో జాయిన్‌ అయినా.. లూప్ లైన్‌లో వేశారు ఉమా మహేశ్వరరావుని… అనంతరం ఇబ్రాహీంపట్నం ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారు. ఎలక్షన్ కోడ్ కారణంగా తిరిగి సీసీఎస్ కు బదిలీ చేశారు. ఇదీ ఆయన ట్రాక్‌ రికార్డ్‌లోని కొద్ది భాగం.


Also Read: తెలంగాణలో ధాన్యం దంగల్..!

అయితే ఇదంతా గతం.. ప్రస్తుతానికి వస్తే.. ప్రస్తుతం ఉమామహేశ్వర్ రావు సాహితీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ మోసాలపై విచారణాధికారిగా ఉన్నారు. ఇది 1500 కోట్ల స్కామ్ అనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అంటే.. సాహితీ ఇన్ఫ్రాపై నమోదైన మొత్తం 57 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్ని విచారించేందుకు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌కు ఆయన ఇంచార్జ్.. అంటే ఈ కేసులన్నింటిని ఆయన విచారిస్తున్నారు. సో వందల కోట్ల స్కామ్‌ను చేదించే బాధ్యత ఆయన భుజాలపై ఉంది. కానీ అసలే అనేక వివాదస్పదుడు అన్న పేరు ఉంది. దానికి తోడు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. మరి ఏసీబీ ఊరుకోదు కదా.. చాలా నెలలుగా ఆయనపై నిఘా ఉంచింది. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది. వారికి ఓ క్లారిటీ రాగానే.. రంగంలోకి దిగారు.. సోదాలు చేశారు.

గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్నప్పుడే ఉమామహేశ్వరావుపై అనేక అవినీతి ఆరోపణలు.. భూ వివాదాల్లో తలదూర్చడం.. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సేమ్ సాహితీ ఇన్ఫ్రా కేసులోనూ నిందితుల నుంచి లబ్ది పొందారన్న ఆరోపణలూ వినిపించాయి. నిందితులకు సపోర్ట్‌ చేస్తూ.. బాధితులకు అన్యాయం చేస్తున్నారన్న కంప్లెంట్స్‌ కూడా ఏసీబీకి అందినట్టు తెలుస్తోంది.
ACB సోదాల్లో భాగంగా పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు. ల్యాండ్‌ డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు..

అయితే సోదాల్లో ఆ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ ఏసీపీ గారి ఇంట్లో మరో ఎస్పీకి చెందిన డాక్యుమెంట్స్ దొరకడం. ఏసీపీ ఇంట్లో ఆ ఎస్పీ డాక్యుమెంట్స్ ఎందుకు ఉన్నాయి? ఏ కారణంతో ఉన్నాయి? అసలు ఆ ఎస్పీకి, ఈ ఏసీపీకి ఉన్న సంబంధమేంటి? వారిది బంధుత్వమా? లేక ఆర్థిక అనుబంధమా? లేక అవినీతిలో పార్టనర్సా? అనేది తేలాల్సి ఉంది.

Tags

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×