Ysrcp Pinnelli destroying an EVM, EC action(Political news in AP): ఎన్నికల వేళ విధ్వంసానికి దిగిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విశ్వరూపం బయటపడింది. తాను ఎమ్మెల్యే అభ్యర్థి అనే విషయాన్ని మరిచిపోయారు. వీధి రౌడీ మాదిరిగా ప్రవర్తించారు.. అడ్డంగా దొరికిపోయారు. పోలింగ్ రోజు ఓ బూత్‌కి వెళ్లి ఈవీఎంలను నేల కేసి కొట్టారాయన. అందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు ప్రాంతం. సింపుల్‌గా చెప్పాలంటే టీడీపీ గట్టి పట్టుకున్న ప్రాంతం. మే 13న పోలింగ్ సందర్భంగా ఆ గ్రామంలోని తన అనుచరులతో కలిసి ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎంను రెండు చేతులతో పైకి ఎత్తి నేలకేసి కొట్టారు. ఈవీఎంలతోపాటు వీవీ ప్యాట్ కిందపడి డ్యామేజ్ అయ్యాయి.
ఈ సమయంలో ఓటు వేస్తున్న ఓ వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు.. పిన్నెల్లిపైకి దూసుకెళ్లారు. ఆయన అనుచరులు అడ్డుకున్నారు. బూత్ నుంచి బయటకు వెళ్తూ పిన్నెల్లి.. టీడీపీ ఏజెంట్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులుగానీ, పోలింగ్ సిబ్బంది ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి వస్తున్న క్రమంలో పోలింగ్ సిబ్బంది నిలబడి ఆయనకు నమస్కారం పెట్టడం గమనార్హం.
ALSO READ: బెంగుళూరు రేవ్ పార్టీ, తెలుగు వారే ఎక్కువ మంది..!
ఈవీఎం డ్యామేజ్‌కి సంబంధించిన వీడియోను గమనించారు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా. ఈ ఘటనపై కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లిని నిందితుడిగా చేర్చనున్నారు. దీనికి సంబంధించిన పుటేజ్‌ను జిల్లా ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనలో ప్రమేయమున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ చెప్పారు. ఈ లెక్కన పిన్నెల్లిపై కఠిన చర్యలను ఎన్నికల సంఘం తీసుకుంటుందా? అన్నది చూడాలి.
ఇదిలావుండగా వీడియో ఫుటేజ్ బయటకురాక ముందు వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ ఛానెల్‌తో మాట్లాడారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మాచర్లలో గొడవలు చేయించింది ముమ్మాటికీ టీడీపీ నేతలేనని దుయ్యబట్టారు. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులను తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో పిన్నెల్లి ఎంత అమాయకుడు అనేది యావత్త రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్, పిన్నెల్లికి మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. సౌమ్యుడు, మంచి గుణగణాలున్నవారని, అంతేకాదు తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.
పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఆ పుటేజీని తర్వాత డిలీట్ చేశారని @nikhilkumar_05 అనే యూజర్ ఆరోపిస్తున్నాడు#ycp #tdp #apelections2024 #apnews #appolitics#politicalnews… pic.twitter.com/EElyaYBMrD
— BIG TV Breaking News (@bigtvtelugu) May 21, 2024