BigTV English

ACCIDENTS : పండగ వేళ విషాదం.. సొంతూళ్లకు పయనమై తిరిగిరాని లోకాలకు..

ACCIDENTS : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అయితే, పండుగ కోసం సొంతూళ్లకు పయనమై.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాద ఘటనలు పలుచోట్ల జరిగాయి. రెండు రోజుల్లోనే వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 12 మందికిపైగా మృత్యువాత పడ్డారు.

ACCIDENTS : పండగ వేళ విషాదం.. సొంతూళ్లకు పయనమై తిరిగిరాని లోకాలకు..

ACCIDENTS : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అయితే, పండుగ కోసం సొంతూళ్లకు పయనమై.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాద ఘటనలు పలుచోట్ల జరిగాయి. రెండు రోజుల్లోనే వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 12 మందికిపైగా మృత్యువాత పడ్డారు.


అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్లే యాక్సిడెంట్లు జరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం టెన్త్ బెటాలియన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌తో వోల్వా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి చిత్తూరుకు 32 మంది ప్రయాణికులతో వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

అలాగే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పండుగ పూజ విషాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్‌టేక్‌ చేయబోయి అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మురో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ రోడ్డు ప్రమాదంతో నలుగురు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. నాగార్జునసాగర్‌ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని తిరిగి వస్తుండగా కంబాలపల్లి శివారులో ఆటోను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.


ఏడుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పల్లెలకెళ్లిన జనం మళ్లీ నగరం బాట పట్టేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు రవాణా అధికారులు. అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండంతో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. తిరిగి సేఫ్‌గా గమ్యానికి చేరుకోవాలని చెబుతున్నారు.

Tags

Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×