E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!
Advertisement

Road Accident: ఇల్లంతా పెళ్లి బాజాలు, బంధువుల కోలాహలంతో ఎంతో సంతోషంగా ఉంది. కానీ, అంతలోనే వారి జీవితాల్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కంభం పరిధిలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణం జరిగింది. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులంతా వివాహ వేడుకల కోసం కంభం వచ్చారు. ఈ క్రమంలోనే రాత్రి వేళ కాస్త ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుందామని అందరూ కలిసి ఒక ఆటో రిక్షాలో సమీపంలోని వినాయక స్వామి ఆలయానికి బయలుదేరారు. కానీ, అదే వారి జీవితాల్లో ఆఖరి ప్రయాణం అవుతుందని వారు ఊహించలేకపోయారు.

గుడి ముందే ముంచేసిన మృత్యువు..
ఆటోలో ప్రయాణించిన వారంతా వినాయక స్వామి గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆటో ఆపిన తర్వాత కొందరు బంధువులు కిందకు దిగగా, మరికొందరు అలసట వల్ల ఆటోలోనే కూర్చుని ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో మదనపల్లె నుండి తెలంగాణలోని వైరాకు కొబ్బరి పీచు ఎరువు లోడుతో వస్తున్న ఒక లారీ అత్యంత వేగంగా, అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. లారీ వేగానికి ఆటో కాస్తా పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతకు గిద్దలూరుకు చెందిన అంకాలు (22), అతని భార్య అలకనంద (18)లతో పాటు నాగేశ్ (18) అనే యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

చితికిన నవదంపతుల బంధం..
ఈ ప్రమాదంలో మరణించిన అంకాలు, అలకనందలకు వివాహమై కొద్దిరోజులే కావడం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. జీవితాన్ని ఇప్పుడిప్పుడే ప్రారంభించిన ఆ నవదంపతులు ఇలా ఒకేసారి రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. వీరితో పాటు తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి నాగాలక్ష్మి (4)ని వెంటనే కంభం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మార్కాపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆ పసిప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. నిన్నటివరకు తమ కళ్లముందే ఆడుకున్న చిన్నారి, కొత్తగా పెళ్లయిన జంట కదలిని స్థితిలో ఉండటం చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఆసుపత్రిలో పెళ్లికూతురు..
అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రమాదంలో పెళ్లికూతురు వీరక్క కూడా తీవ్రంగా గాయపడింది. ఆమెతో పాటు మరో ఏడుగురు బంధువులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులలో సంజీవరాయుడు, వీరయ్య, ఓలమ్మల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కంభం సిఐ మల్లికార్జున్, ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement

Also Read: నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

Related News

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

పిల్లలను వాషింగ్ మెషిన్ లోపల పెట్టి.. బెంగళూరు డే-కేర్ సెంటర్‌లో దారుణాలు, ఐదుగురు అరెస్ట్?

హనుమకొండలో విషాదం.. పెళ్లింట్లో విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన స్లీపర్ బస్సు.. 8 మంది మృతి!

Gold Seized: బంగారం అక్రమ రవాణా.. 37 కేజీల గోల్డ్ సీజ్, తెర వెనుక ఇంటర్నేషనల్ ముఠా

ORRపై అర్ధరాత్రి కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌పై పోలీసుల కాల్పులు!

పల్నాడులో ఘోరం.. ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ.. నలుగురు సజీవ దహనం!

Big Stories

×