E-Paper

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!
Advertisement

Jahnavi: 26 రోజులు.. సుమారుగా ఒక నెల. కన్నబిడ్డ కనిపించకుండా పోయి ఇన్నాళ్లు అవుతుంటే.. ఆ తల్లిదండ్రుల మానసిక స్థితి ఎలా ఉంటుందీ? కన్నవారు- తమ బిడ్డ ఆచూకీ కోసం ఎంత ఎదురు చూస్తారో చెప్పడానికిదో ఉదాహరణ. ఒక పాపాయి, ఆమెతో వెళ్లిన పెంపుడు కుక్క.. ఒక తోటలో తప్పి పోతే.. ఆ కుక్క కూడా నీరు ఆహారం అందక చనిపోతే, ఆ చిన్నారి ఆచూకీ ఎక్కడనుకోవాలి? అసలామె బతికి ఉందా లేదా? ఈ నిజం ఒప్పుకోడానికి ఎంత ధైర్యముండాలి? ఎన్నేసి ఆశల మధ్య ఆ కన్న మనసు ఎంతగా ఊగిసలాడుతుంది? నేను ఇంత చెబుతున్నానంటే, ఆ కన్నవాళ్లెవరో మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదూ? ఎస్. మీ ఊహ కరెక్టే. ఆమె కాకినాడ జిల్లాకు చెందిన చిన్నారి జాహ్నవి. జాహ్నవి జాడ ఎక్కడ? అని బిగ్ టీవీ నిరంతర కథనాలను నడిపింది. లైవ్ టెలికాస్ట్ లు చేసింది. పోలీసులు కూడా ఈ కేసునొక ప్రిస్టేజియస్ ఆపరేషన్ గా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తల్లికి తన కూతురు కోసం ఎదురు చూసి చూసి కళ్లు కాయలు కాచాయి. ఇక ఆ తండ్రి గుండె పరిస్థితి చెప్పనలవి కాదు. ఇంతకీ ఆ చిన్నారిని కన్న తండ్రి ఏం చేస్తున్నాడనేగా మీ క్వశ్చిన్.

జానూ ఓ జానూ.. జాహ్నవీ అంటూ ఆ చిన్నారి కోసం ఆ తల్లిదండ్రులు ఇన్నాళ్లూ ఎంతగా ఎదురు చూశారో రెండు తెలుగు రాష్ట్రాలకూ తెలుసు.. ఇప్పుడు తండ్రి గుండె గోస ఎలా ఉందో మీరే చూడండి. పోస్టర్లు అంటిస్తున్న ఇమేజెస్ ఒక వీడియోగా రూపొందించాలి.  జాహ్నవీ జాడ మీకెవరికైనా కనిపిస్తే.. మాకు చెప్పండి అంటూ పోస్టర్లను వేస్తున్నాడా తండ్రి.. గమనించారా? ఇది ఒక తండ్రి ఆవేదన. ఇంకా తన కూతురు దొరుకుతుందేమో అన్న ఆశాభావానికి చిహ్నం. ఏజెన్సీలోని వివిధ గ్రామాల్లో తన కుమార్తె ఆచూకీ కోసం పోస్టర్లు అంటిస్తున్నాడు జాహ్నవి తండ్రి గణేశ్. అతడలా చేస్తుంటే, దారిన పోయేవాళ్లంతా ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు. వారికి కూడా తన కడుపు కోత గురించి చెబుతున్నాడు గణేశ్.

Advertisement

చింతపల్లి, పాడేరు ఘాట్ పరిసర ప్రాంతాలన్నిటిలోనూ.. ఇప్పుడిదే అతిపెద్ద చర్చ. బాధిత తండ్రి గణేశ్ తన కుమార్తె కోసం వెతుకుతుండటం తెలిసి.. వారు కూడా తల్లడిల్లి పోతున్నారు. గణేశ్ మాటలను గుర్తు పెట్టుకుని.. తాము కూడా జాహ్నవి జాడ కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకూ పోలీసులు ఎన్నో యత్నాలు చేశారు. టెక్నికల్ గా ట్రాకింగ్ చేసి మరీ తమ వంతుగా ప్రయత్నించి చూశారు. ఈ కేసు విషయంలో తమకు తెలిసినంత సాంకేతిక పరిజ్ఞానం వాడేశారు. కానీ, అవేవీ ఫలితాలను ఇవ్వలేదు. దీంతో లాభం లేదని భావించిన ఆ కన్న మనసు.. తన వంతు యత్నం చేయడం ప్రారంభించింది. ఇదిగో ఇలా పోస్టర్లు వేయడం మొదలు పెట్టింది గణేశ్ కన్నమనసు.

Also Read: బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే.. దేవుడి పేరుతో మోసాలు చాలు.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

Related News

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

పిల్లలను వాషింగ్ మెషిన్ లోపల పెట్టి.. బెంగళూరు డే-కేర్ సెంటర్‌లో దారుణాలు, ఐదుగురు అరెస్ట్?

హనుమకొండలో విషాదం.. పెళ్లింట్లో విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన స్లీపర్ బస్సు.. 8 మంది మృతి!

Gold Seized: బంగారం అక్రమ రవాణా.. 37 కేజీల గోల్డ్ సీజ్, తెర వెనుక ఇంటర్నేషనల్ ముఠా

Big Stories

×