E-Paper
Advertisement

Telangana Elections : భువనగిరిలో అసమ్మతి సెగ.. బీఆర్ఎస్ రెబల్‌గా మాజీ మావోయిస్టు భార్య!

Telangana Elections : భువనగిరిలో అసమ్మతి సెగ.. బీఆర్ఎస్ రెబల్‌గా మాజీ మావోయిస్టు  భార్య!
Advertisement

Telangana Elections : భువనగిరి పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంటే. గత రెండు దఫాలుగా ఈ సెగ్మెంట్లో తిరుగులేని విజయాలు సాధిస్తున్న బీఆర్ఎస్‌కు ఎన్నికల ముందు భారీ షాక్‌లే తగులుతున్నాయి. ఓవైపు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి గ్రౌండ్ లో నిరసన వ్యక్తం అవుతుండగా.. బీఆర్ఎస్‌లో అసంతృప్తులు మరో టెన్షన్ గా మారాయి. ఇంకోవైపు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కారెక్కినట్లే ఎక్కి దిగడంతో భువనగిరి గులాబీ శ్రేణులు కన్ఫ్యూజన్ లో పడిపోయాయంటున్నారు.

భువనగిరి బీఆర్ఎస్‌‌లో అసమ్మతి సెగ రాజుకుంది. బీఆరెస్ రెబల్‌గా బరిలో నిలవాలని దివంగత కొనపురి రాములు సతీమణి కవిత నిర్ణయం తీసుకోవడంతో బీఆరెస్ శ్రేణులలో గందరగోళం నెలకొంది. పైళ్లకు నియోజకవర్గంలో అడుగడుగునా అసమ్మతి సెగలు తగులుతుండగా, కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలతో క్రమక్రమంగా కుంభం గ్రాఫ్ మరింత పెరుగుతోంది. పోలింగ్ టైం దగ్గర పడేకొద్దీ భువనగిరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతున్నాయి.

Advertisement

ఎన్నికల షెడ్యూల్ కు ముందు బీఆర్ఎస్ జోరు స్పష్టంగా కనిపించింది. భువనగిరిలో ఇద్దరు నేతలే కీలకం. అందులో ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. ఇంకొకరు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న కుంభం షెడ్యూల్ కు ముందు ప్రగతి భవన్ వెళ్లి గులాబీ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు డీలా పడ్డాయి. అయితే మళ్లీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పైగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇంటింటికి తీసుకెళ్తుండడంతో జనం నుంచి మంచి స్పందన వస్తుందంటున్నారు. కుంభం అనిల్ సతీమణి, కూతురు, కుమారుడు సైతం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు బాగా పుంజుకున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు భువనగిరి నియోజకవర్గంలో పైళ్ల, కుంభం మధ్య నువ్వా-నేనా అనే రీతిలో ఉన్న పోరు ఇప్పుడు కుంభందే పైచేయిగా మారిందా అన్నట్లుగా పరిణామాలు మారిపోయాయి.

భువనగిరి నియోజకవర్గంలో రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన పైళ్ల శేఖర్ రెడ్డికి ఈసారి ఎదురుగాలి వీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయనపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి పెరగడంతో బీఆరెస్ క్యాడర్‌లో కొంత అలజడి మొదలయింది. మాజీ మావోయిస్టు దివంగత బీఆర్ఎస్ నేత కొనపూరి రాములు భార్య కొనపురి కవిత భువనగిరి అసెంబ్లీ ఎన్నికలలో బరిలో బీసీ సామాజికవర్గం తరపున బీఆరెస్ రెబల్ గా నిలుస్తున్నానని ప్రకటించడంతో భువనగిరి నియోజకవర్గ బీఆరెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. వలిగొండ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా పనిచేసిన ఆమెకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. గత కొన్ని నెలలుగా కొనపురి కవిత అధికార పార్టీకి, ఇటు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో దూరంగా ఉంటూ, నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలను, బీసీలను కలుపుకొని ఈసారి ఎన్నికలలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని కొంత మంది ముఖ్య నేతలతో ఆమె భువనగిరిలో రహస్య సమావేశం నిర్వహించారు. ఉద్యమకారులు, అమరుల కుటుంబాల ప్రోత్సాహంతో బిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు పైళ్ల ప్రచారంలో ఆయన సొంత క్యాడర్ సైతం పాల్గొనడం లేదు. దీంతో బిఆర్ఎస్ శిబిరంలో అలజడి కనిపిస్తోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×