E-Paper
Advertisement

BJP First List : బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. కేసీఆర్ పై ఈటల పోటీ..

BJP First List : బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. కేసీఆర్ పై ఈటల పోటీ..

BJP First List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 52 మందితో ఫస్ట్‌ లిస్ట్‌ ప్రకటించింది కాషాయ పార్టీ అధిష్టానం. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కేసీఆర్‌పై పోటీకి దింపింది. హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌ నుంచి ఈటల బరిలోకి దిగనున్నారు.

ఇక మంత్రి కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు రాణి రుద్రమను సెలెక్ట్‌ చేశారు. దుబ్బాక నుంచి రఘునందన్‌రావు, గోషామహాల్‌ నుంచి రాజాసింగ్‌ పోటీ చేయనున్నారు. కరీంనగర్ బరిలో బండి సంజయ్ ఉన్నారు. కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు.

హుజురాబాద్‌ – ఈటల రాజేందర్‌
గజ్వేల్- ఈటల రాజేందర్
కరీంనగర్‌ – బండి సంజయ్‌
కోరుట్ల- ధర్మపురి అర్వింద్‌
దుబ్బాక – రఘునందన్‌ రావు
గోషామహల్- రాజాసింగ్
నర్సాపూర్‌ – మురళీ యాదవ్‌
పటాన్‌చెరు – నందీశ్వర్‌ గౌడ్‌
సిర్పూర్‌ – పాల్వాయి హరీశ్‌ బాబు
ఆదిలాబాద్‌- పాయల్‌ శంకర్‌

నిర్మల్‌- ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి
ముథోల్‌ – రామారావు పటేల్‌
ఆర్మూరు- పైడి రాకేశ్ రెడ్డి
కామారెడ్డి -వెంకట రమణా రెడ్డి
నిజామాబాద్‌ అర్బన్‌- సూర్యనారాయణ గుప్త
బాల్కొండ – ఆలేటి అన్నపూర్ణమ్మ
జగిత్యాల – బోగ శ్రావణి
ధర్మపురి -ఎస్‌.కుమార్‌
సిరిసిల్ల – రాణి రుద్రమ రెడ్డి
రామగుండం – కందుల సంధ్యారాణి

చార్మినార్‌-మేఘారాణి
చాంద్రాయణగుట్ట-సత్యనారాయణ ముదిరాజ్‌
యాకుత్‌పురా-వీరేందర్‌ యాదవ్‌
బహుదూర్‌పురా-నరేశ్‌కుమార్‌
కల్వకుర్తి-తాల్లోజు ఆచారి
కొల్లాపూర్‌-ఎ.సుధాకర్‌రావు
నాగార్జునసాగర్‌-కంకణాల నివేదితా రెడ్డి
సూర్యాపేట-సంకినేని వెంకటేశ్వరరావు
భువనగిరి- గూడూరు నారాయణరెడ్డి
తుంగతుర్తి- కడియం రామచంద్రయ్య

జనగామ- ఆరుట్ల దశమంత్‌రెడ్డి
పాలకుర్తి- లేగ రామ్మోహన్‌రెడ్డి
వరంగల్‌ వెస్ట్‌- రావు పద్మ
వరంగల్‌ ఈస్ట్‌- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
భూపాలపల్లి- చందుపట్ల కీర్తిరెడ్డి
కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
ఇబ్రహీంపట్నం- నోముల దయానంద్ గౌడ్
మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్
ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి
కార్వాన్- అమర్ సింగ్

బెల్లంపల్లి (ఎస్సీ)- అమరాజుల శ్రీదేవి
జుక్కల్‌(ఎస్సీ) – టి. అరుణ తార
చొప్పదండి (ఎస్సీ) – బొడిగ శోభ
మానకొండూరు( ఎస్సీ)- ఆరెపల్లి మోహన్‌
స్టేషన్‌ ఘన్‌పూర్‌(ఎస్సీ)- డాక్టర్‌ గుండే విజయరామారావు
వర్ధన్నపేట (ఎస్సీ)- కొండేటి శ్రీధర్‌

ఖానాపూర్‌ (ఎస్టీ) – రమేశ్‌ రాఠోడ్‌
బోథ్‌ (ఎస్టీ)- సోయం బాపూరావు
డోర్నకల్‌ (ఎస్టీ)- భుక్యా సంగీత
ఇల్లెందు (ఎస్టీ)- రవీందర్‌ నాయక్‌
భద్రాచలం (ఎస్టీ)- కుంజా ధర్మారావు
మహబూబాబాద్‌ (ఎస్టీ)- జతోత్‌ హుస్సేన్‌ నాయక్‌

ఓ వైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ ప్రచారంతో దూసుకుపోతుంటే.. బీజేపీ మాత్రం తొలివిడత జాబితా విడుదల చేయడానికి సుదీర్ఘంగా కసరత్తు చేసింది. అభ్యంతరం లేని స్థానాల్లోని అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. ఆ అభ్యర్థులకు కిషన్ రెడ్డి, ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్ కాల్ చేసి టికెట్ కన్ఫామ్ అయినట్టు ముందే సమాచారం ఇచ్చారు. మరోవైపు తొలి జాబితా అధికారికంగా విడుదల కాకముందు నుంచే పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×