E-Paper
Advertisement

BRS : అనుకున్నట్టే అయ్యింది.. బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా?

BRS : అనుకున్నట్టే అయ్యింది.. బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా?
Advertisement

మున్సిపల్ ఎన్నికల ప్రచారం, పోలింగ్ సైతం ముగిసింది.ఎగ్జిట్ పోల్స్ సైతం వచ్చాయి. అన్ని సర్వేలు అధికార కాంగ్రెస్ పార్టీకే జై కొట్టాయి. ఇక్కడ విశేషం ఎంటంటే కారు పార్టీ కంటే కమలం పార్టీ ఈ సారి సత్తా చాటింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు,7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే సుమారు 70కి పైగా మున్సిపాలిటీలు,5 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నట్టు సర్వేలు తేల్చాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 30కి పైగా మున్సిపాలిటీల్లో సత్తా చాటినట్టు తెలుస్తున్నది. కార్పొరేషన్ల విషయానికొస్తే ఆ పార్టీ ఖాతాలో జీరో ఉన్నట్టు సమాచారం. కానీ, కమలం పార్టీ ఖాతాలో రెండు మేజర్ మున్సిపాలిటీలు చేరుతున్నట్టు తెలుస్తోంది. 5 నుంచి 10లోపు మున్సిపాలిటీలు సైతం కమలం పార్టీ కైవసం చేసుకోబోతున్నట్టు సమాచారం.

బీఆర్ఎస్‌కు మరో‘సారీ’

గత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎదురైన చేదు అనుభవం మరోసారి మున్సిపల్ ఎన్నికల రూపంలో ఎదురు కానుందని సమాచారం. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా శ్రమించారు. మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు సైతం ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, సింగరేణి నిధులు దుర్వినియోగం చేసిందని, నైనీ బొగ్గు బ్లాకుల్లో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనికి తోడు భూ బదాలయింపుల పేరిట వేల కోట్ల స్కాంకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని ఆరోపించారు. వీటన్నింటినీ ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదని ఈ సర్వేలను బట్టి తెలుస్తోంది.

ఫలించిన రేవంత్ స్ట్రాటజీ..

Advertisement

గత సర్పంచ్ ఎన్నికల్లో మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని సీఎం రేవంత్ ముందే ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు జిల్లాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి అనంతరం నిర్వహించిన సభల్లో జనాలకు పలు కీలక వాగ్దానాలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మనవారిని గెలిపించాలని.. మున్సిపల్ మంత్రిగా తానే ఉన్నానని..నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిజంగా అభివృద్ధి చేసేది ఉంటే అప్పుడు చేయాల్సింది కదా? ఇప్పుడు మళ్లీ వచ్చి అభివృద్ధి చేస్తామని.. కేసీఆర్‌ను చూసి ఓటు వేయాలని కోరడం ఏంటని జనాలను అర్థం అయ్యేలా ప్రసంగించారు. కేసీఆర్‌ను గెలిపిస్తే ఆయన పోయి ఫాంహౌస్‌లో పడుకున్నారని.. ఆయనే రానప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే కౌన్సిలర్లుగా గెలిచిన వారు చేస్తారని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు.

Vijay – Rashmika: రష్మికతో పెళ్లి వార్తల వేళ.. మరో యువతితో చనువుగా విజయ్.. ఫోటోలు వైరల్!

Advertisement

ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి, అక్రమాలు, సిట్ విచారణ.. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు డిఫెక్టు ఇలా అన్నింటినిపై సీఎం రేవంత్ ప్రశ్నించడంతో జనాలు సైతం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా దూరంగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట మాత్రమే ఆ పార్టీకి సీట్లు వచ్చాయని తెలుస్తున్నది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండో స్థానంలో ఉన్న గులాబీ పార్టీ మూడో స్థానానికి పడిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకుంటే బీజేపీ క్రమంగా రాష్ట్రంలో బలపడుతూ వస్తున్నది. రెండు కార్పొరేషన్లలో బీజేపీ సత్తా చాటిందంటే.. రాబోయే గ్రేటర్ హైదరాబాద్, ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికల్లోనూ సత్తా చాటే అవకాశం లేకపోలేదు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే జనరల్ ఎలక్షన్స్‌లోనూ బీజేపీ సత్తా చాటడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×