Telangana PCC: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధిష్ఠానం (ఏఐసీసీ) ప్రశంసలు అందుకుంటోంది. తెలంగాణ పీసీసీ చేపడుతున్న కార్యక్రమాలపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్‌లు సవతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పార్టీలో నూతన జవసత్వాలు ఉట్టిపడుతున్నాయని ప్రశంసించింది.
క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో తెలంగాణ పీసీసీ అనుసరిస్తున్న వ్యూహాలు, సంస్థాగత కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రత్యేకంగా ఏఐసీసీ అభినందనలు తెలిపింది. అంతేగాక టీపీసీసీ తాజా కార్యాచరణ, సాధించిన ప్రగతిపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ, నాయకత్వ పటిమను కొనియాడారు. ఏఐసీసీ పిలుపును అందిపుచ్చుకుంటూ, తెలంగాణ వ్యాప్తంగా పలు పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినట్లు ఏఐసీసీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఏఐసీసీ నుంచి 11 మంది పీసీసీలకు కాంప్లిమెంట్స్ లభించగా, అందులో తెలంగాణ కూడా ఉండటం గమనార్హం.
సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా పార్టీ నిర్మాణాన్ని కిందిస్థాయి వరకు తీసుకెళ్లడంపై ఏఐసీసీ సంతృప్తి చెందింది. ఇక జై బాపు – జై భీమ్ , మనగేర వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సామాజిక చైతన్యాన్ని సృష్టించడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లిన ప్రజా ఉద్యమాలు చేపట్టినట్లు ఏఐసీసీ కొనియాడింది. దీంతో పాటు డీసీసీ కమిటీల ఏర్పాటు, మండల కమిటీల నియామకం, డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరాల నిర్వహణ పై కూడా కాంప్లిమెంట్స్ లభించాయి. దీంతో పాటు ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ, బీఎల్‌ఏ శిక్షణా కార్యక్రమాలు, జనహిత పాదయాత్రపై ఏఐసీసీ కోర్ టీమ్ సమగ్ర సమీక్ష నిర్వహించి వివరాలు సేకరించింది.
Also read: వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
తెలంగాణలో అమలవుతున్న ఈ సంస్థాగత విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తుండటంతో, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా దీనిని ఒక రోల్ మోడల్‌గా తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి సంబంధించి ప్రతి నెల సమగ్ర కార్యాచరణ నివేదికను ఏఐసీసీ టీమ్ ఢిల్లీకి పంపిస్తున్నది. వీటన్నింటినీ పరిశీలించి అధిష్టానం అభినందనలు తెలిపింది.
పదేళ్ల పవర్ ను పొందేందుకు చేయాల్సిన వ్యూహాలు, అనుసరించాల్సిన విధానంపై ఏఐసీసీ ..పీసీసీకీ ప్రత్యేకంగా వివరించింది. భవిష్యత్తులో సోషల్ మీడియా, కనెక్టింగ్ సెంటర్, పార్టీ సంస్థాగత కార్యక్రమాలను మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.రాహుల్ గాంధీ నాయకత్వాన్ని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త శ్రమించాలని పేర్కొన్నది. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ నెట్‌వర్క్‌ను పటిష్టం చేయాలని అధిష్టానం టాస్క్ ఇచ్చింది.
మరోవైపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీ చేపట్టిన వివిధ సంస్థాగత కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్, జై బాపు – జై భీమ్, మనగేర కార్యక్రమం, డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరాలు, ఎస్‌ఐఆర్ శిక్షణా కార్యక్రమాలు, బీఎల్‌ఏల నియామకాలు, డీసీసీ కమిటీల ఏర్పాటు, మండల కమిటీల నియామకం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
Also Read: Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు