E-Paper
Advertisement

HYD Metro: ఎయిర్‌పోర్టుకు మెట్రో కష్టమేనా?.. ఎందుకంటే..?

HYD Metro: ఎయిర్‌పోర్టుకు మెట్రో కష్టమేనా?.. ఎందుకంటే..?
Advertisement

HYD Metro: హైదరాబాద్ మెట్రోను శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెట్రో నిర్మించనున్నారు. మెట్రో రూట్ మ్యాప్ పై కార్యకరణ రెడీ అవుతోంది. అయితే, ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైల్ వేయడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. మధ్యలో అనేక ఆటంకాలు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లతో అడ్డదిడ్డంగా ఉందా రూట్. ఈ విషయం మరెవరో చెబుతున్నది కాదు. స్వయంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డినే అంటున్నారు మరి.

రాయదుర్గం స్టేషన్‌ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ వరకు మెట్రో నిర్మాణం అతి క్లిష్టమైనదని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలోని అడ్డంకులు దాటుకొని మెట్రో నిర్మించేందుకు అత్యుత్తమ ఇంజినీరింగ్ పరిష్కారాల కోసం అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పలుమార్లు ఈ మార్గాన్ని పరిశీలించిన అధికారులు మరోసారి రూట్‌మ్యాప్‌ పరిశీలన చేపట్టారు.

Advertisement

మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, రైల్వే బోర్డు సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు శనివారం ప్రత్యక్షంగా రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ వరకు.. మెట్రో నిర్మాణం చాలాక్లిష్టమైన పనిగా గుర్తించారు.

మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ దగ్గర అండర్‌పాస్‌, మధ్యలో రోటరీ క్లబ్‌, పైన ఫ్లైఓవర్‌ ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. 21 మీటర్ల ఎత్తులో మైండోస్పేస్‌ జంక్షన్‌ దాటడం సవాలుతో కూడుకున్న పని. ఫ్లైఓవర్ పిల్లర్లకు దూరంగా మెట్రో పిల్లర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో మెట్రో నిర్మాణం ఏవిధంగా చేపట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎదురయ్యే సాంకేతిక సవాళ్లు ఏంటి? పరిష్కార మార్గాలు ఏమేం ఉన్నాయి? తదితర అంశాలపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పర్యవేక్షణలో ఇంజినీర్ల టీమ్ కసరత్తు చేస్తోంది. ఎంత కష్టమైనా.. సవాల్ ను స్వీకరిస్తామని అంటున్నారు మెట్రో అధికారులు.

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×