E-Paper
Advertisement

CM Revanth Reddy: ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంట‌ర్‌ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ ఆరా !

CM Revanth Reddy: ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంట‌ర్‌ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ ఆరా !
Advertisement

CM Revanth Reddy: ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంట‌ర్‌ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌తో మాట్లాడారు. ఘ‌ట‌న ఎలా జరిగింది.. అందుకు సంబంధించిన వివ‌రాలతో పాటు తెలంగాణ వాసులు ఎవ‌రైనా ఉన్నారా అని ప్ర‌శ్నించారు. మృతుల్లో ఎవ‌రైనా రాష్ట్ర వాసులంటే బాధిత కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ‌ స‌హ‌కారాలు అందించాల‌ని ఆదేశించారు.

తెలంగాణ వాసులు ఎవ‌రూ లేర‌ని రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ తెలిపారు. మృతుల్లో తానియా సోని బీహార్ రాష్ట్రానికి చెందిన యువ‌తి అని, ఆమె తండ్రి విజ‌య్ కుమార్ సింగ‌రేణి సంస్థ‌లో సీనియ‌ర్ మేనేజ‌ర్‌గా మంచిర్యాల‌లో ప‌ని చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రికి తెలిపారు. తానియా సోని మృత‌దేహాన్ని  తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీంతో విజ‌య్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని రెసిడెంట్ క‌మిష‌న‌ర్‌ను సీఎం ఆదేశించారు.

Advertisement

ఢిల్లీలో శనివారం భారీ వర్షాల కారణంగా రాజేంద్ర నగర్‌లో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్ లోకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఈ ఘటనలో అక్కడే చదువుకుంటున్న విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా సీఎం ఈ ఘటనపై ఆరా తీసారు.

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×