E-Paper
Advertisement

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్
Advertisement

Uday Krishna Reddy Health: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్యం ఎలా వుంది? డాక్టర్లు ఏమంటున్నారు? కొన్నాళ్లు ట్రీట్‌మెంట్ తప్పదని అంటున్నారా? ఉదయ్ ఆరోగ్యంపై డాక్టర్ రవిశంకర్ చెప్పిన షాకింగ్ విషయాలేంటి? ఆయా విషయాలను ఒక్కసారి చూద్దాం.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు ఉదయ్ కృష్ణారెడ్డి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం ఉదయ్ ఆరోగ్య గురించి బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు డాక్టర్ రవి శంకర్‌రెడ్డి. ఇంతకీ ఆయన చెప్పిన షాకింగ్ విషయాలు ఇలా ఉన్నాయి.

Advertisement

 డిప్రెషన్ వల్ల మద్యం ఎక్కువ తాగారు-ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా‌రెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేయలేదన్నారు. ఆయన ఎలాంటి సానిటైజర్, ఇతర డ్రగ్ తీసుకోలేదన్నారు. కేవలం డిప్రెషన్, ఒత్తిడి వల్లే మద్యం ఎక్కువ తాగేశారని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఉదయ్‌కి అన్ని రకాల పరీక్షలు చేశామని, అన్నీ నెగిటివ్‌గా వచ్చాయన్నారు. రేపు ఉదయ్‌ని డిశ్చార్జ్ చేస్తామన్నారు.

బుధవారం డిశ్చాజ్ చేస్తాం-ప్రస్తుతం ఆహారం తీసుకోలేక పోతున్నారని, అందుకే ఫ్లూయిడ్స్ ఇచ్చామన్నారు. ఉదయ్‌ని రేపు సంబంధిత కేసు గురించి  పోలీసులు ప్రశ్నించవచ్చన్నారు. సకాలంలో  హాస్పిటల్‌కి తీసుకొచ్చారని, లేకుంటే ఇబ్బంది పడేవాళ్ళని అన్నారు. సైక్రియాటిస్ట్ ని పిలిచి ఓ సెషన్ చేయించామన్నారు. సెల్ఫోన్ నిన్నటి నుండి వాడలేదన్నారు.

Advertisement

ఉదయ్ రాసిన గురించి కొన్ని విషయాలు బయటపెట్టారు. ఉదయ్ మత్తులో ఉన్నారని, ఆ లెటర్ ఎప్పుడు పంపారు అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేక పోతున్నారని చెప్పారు. ఆత్మహత్య‌కు ప్రయత్నించలేదని, ఏం జరిగిందో తెలపడానికి లెటర్ రాసి ఉంటానని అన్నట్లు తెలిపారు. మద్యం మత్తులో లెటర్ రాసినట్టు వెల్లడించారు.

ఉదయ్ కు గొంతు నొప్పి ఎక్కువగా ఉందన్న డాక్టర్, ఆయన వేగంగా కొలుకుంటే మంగళవారం సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే అవకాశముందని సూచనప్రాయంగా చెప్పారు. ఉదయ్ ఆసుపత్రికి వచ్చినప్పుడు స్పృహలో లేరన్నారు. ఆయన ఏమైనా తీసుకున్నారేమోనని తమకు అనుమానంగా ఉందని కుటుంబసభ్యులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ALSO READ: హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

పక్కన శానిటైజర్ బాటిల్ పడిందన్నారు.  ప్రస్తుతం బాగానే ఉదయ్ మాట్లాడుతున్నారని,  శానిటైజర్ తీసుకున్నా అని అడిగినప్పుడు గుర్తు లేదని చెప్పినట్టు తెలిపారు. ఆల్కహాలు మత్తులో ఏమైనా తీసుకున్నానో లేదా అని అనుమానంగా చెప్పినట్టు వివరించారు. తాను ఆత్మహత్యకు పాల్పడలేదని అన్నట్లు తెలియజేశారు.

ఆల్కహాలు ఎక్కువగా తీసుకున్నట్లు ఉదయ్ చెప్పినట్టు వివరించారు. వచ్చిన ఆరోపణలపై ఆయన ఏమీ మాట్లాడలేదని, ఆ విషయాన్ని అడగలేదన్నారు. తాను రెగ్యులర్‌గా ఆల్కహాలు తీసుకోనని అన్నారట. సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన ఉదయ్, సాయంత్రానికి స్పృహలోకి వచ్చినట్టు తెలిపారు.

 

 

 

 

Related News

నా చెల్లి సమాచారం లేదు.. ఫేక్ ప్రచారాలు నమ్మెుద్దు.. సుహాసిని అన్న ఆవేదన!

రాష్ట్రంలో ఘోరం.. రాఖీ పండక్కి ఊరికి వెళ్తే.. 30 మంది కొట్టి చంపారు!

మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు.. ఎమ్మెల్సీని బహిష్కరించిన మజ్లిస్ పార్టీ

తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ప్రైవేటు స్కూళ్లు దోపిడీ చేస్తే.. ఈ వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయండి!

మంత్రి సురేఖ ఎపిసోడ్‌.. సీఎం రేవంత్ సైలెన్స్ వెనుక పెద్ద స్కెచ్ ఉందా?

అలాంటి ప్రతిపాదన ఇప్పట్లో లేదు.. ప్రైవేటీకరణ ప్రచారానికి జీహెచ్ఎంసీ చెక్!

గోల్కొండ నుంచి చార్మినార్‌కు రహస్య సొరంగం ఉందా? పురావస్తు శాఖ ఏం చెబుతోంది?

సెప్టెంబర్ 2 నుంచి BRS పోరుబాట.. కాంగ్రెస్ వైఫల్యాలపై నిలదీత.. శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం!

Big Stories

Advertisement
×