E-Paper
Advertisement

సీఎం రేవంత్‌కు పాలాభిషేకాలు చేయాల్సిందే.. TGPSC ప్రకటనపై చనగాని దయాకర్!

సీఎం రేవంత్‌కు పాలాభిషేకాలు చేయాల్సిందే.. TGPSC ప్రకటనపై చనగాని దయాకర్!
Advertisement

Chanagani Dayakar: టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని ఆయన కొనియాడారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ

Advertisement

రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిన తర్వాతే నిరుద్యోగులకు నిజమైన న్యాయం జరుగుతోందని చనగాని దయాకర్ అన్నారు. మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ, కేవలం ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించిందని గుర్తుచేశారు. తాజాగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై TGPSC (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) స్పష్టమైన ప్రకటన చేయడాన్ని ఆయన హృదయపూర్వకంగా స్వాగతించారు.

బీఆర్ఎస్ విష ప్రచారాలకు చెక్

Advertisement

గత ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా ఎన్నో విష ప్రచారాలు చేశారని దయాకర్ మండిపడ్డారు. అయితే, తెలంగాణ యువత వాస్తవాలను గ్రహించి, ఆ ఆపప్రచారాలను తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పాలిట ఆశాదీపంగా మారారని, ఈ సంతోష సమయంలో యువత అంతా ఆయనకు పాలాభిషేకాలు చేసి తమ కృతజ్ఞతలు చాటుకోవాలని పిలుపునిచ్చారు.

యువత భవిష్యత్తే లక్ష్యంగా పాలన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ యువత భవిష్యత్తు చుట్టూనే ఉంటాయని దయాకర్ పేర్కొన్నారు. విద్యా రంగంలో సంస్కరణలు, ఉపాధి అవకాశాల పెంపు, ఉద్యోగాల కల్పన అనే మూడు సూత్రాల లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం శ్రమిస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లతో తెలంగాణ యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: కాంగ్రెస్ ఎస్సీ విభాగం విస్తృత స్థాయి సమావేశం.. ఎస్సీ నాయకులకు టీపీసీసీ చీఫ్ దిశానిర్దేశం!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×