E-Paper
Advertisement

పాలమూరులో ఇసుక మాఫియా అరాచకం.. దందా అడ్డుకుంటే పై నుంచి ఫోన్లు..?

పాలమూరులో ఇసుక మాఫియా అరాచకం.. దందా అడ్డుకుంటే పై నుంచి ఫోన్లు..?
Advertisement

Sand Mafia: స్వేచ్ఛ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పోలీసులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లను పట్టుకున్న తమకున్న అవకాశాలు చట్టాల్లోని లొసుగులను అడ్డుపెట్టుకొని కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంత తీర గ్రామాలతో పాటు తుంగభద్ర నదితో పాటు దుందుభి నది పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. పోలీసులు చట్టాన్ని కఠినంగా అమలు చేయకపోవడంతో ప్రకృతి సంపద దెబ్బతినడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది.

పలుమార్లు పట్టుబడుతున్నా

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు తరచూ పట్టుబడుతున్న కొందరు పోలీసు అధికారులు మామూలు తీసుకుంటూ వాహనాన్ని కోర్టుకు కాకుండా తహసిల్దార్, మైనింగ్ అధికారులకు పంపిస్తున్నారు. మూడోసారి పట్టుబడినట్లు పేర్కొంటే, సీజ్ చేసే అవకాశం ఉంటుందని మొదటిసారి దొరికినట్లుగా రికార్డ్ రాస్తున్నారు. దీంతో అక్రమ రవాణా దారులు అమామ్యాలు సమర్పించుకుంటూ రాత్రి, పగలు అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. అక్రమార్కులను కాపాడేందుకు ఖద్దర్ నాయకుల జోక్యం సైతం అధికంగా ఉంటోంది.

తహశీల్దార్, మైనింగ్ శాఖకు పంపితే..

Advertisement

పట్టుబడిన ఇసుక అక్రమ రవాణా వాహనాలను సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి తహసిల్దార్, మైనింగ్ అధికారుల చర్యలకు పంపినట్లయితే మొదటి రెండు అక్రమ రవాణాకు జరిమానాలు విధిస్తారు. ఇసుకను తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఇసుకను డంపు చేసి సంబంధిత అధికారి విధించిన జరిమాన చెల్లించిన తర్వాత ట్రాక్టర్లను విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ట్రాక్టర్ తక్కువ సమయంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Also read: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 3 ఎంఎంటీఎస్ స్టేషన్లు!

కోర్టులో హాజరు పరిస్తే

Advertisement

అనుమతులు లేకుండా ఏ వాహనమైన ఇసుక రవాణ చేస్తే చట్ట ప్రకారం ఇలా వాహనం పోలీసులకు పట్టుబడితే బి.ఎన్.ఎస్ 303 (2),21(4) ఏం ఏం డి ఆర్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నారు. నిందితుడు ఎక్కువసార్లు ఇసుక అక్రమ రవాణా చేస్తే పీజీసీపీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిస్తే కోర్టు సూచనల మేరకు తహసశీల్దార్ కార్యాలయంలో పోయించి కోర్టు ద్వారా వాహనాన్ని రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ట్రాక్టర్ విడుదల కావాలంటే సుమారు నెలరోజుల సమయం పడుతుంది.

జరిమానాలు ఇలా..

వాహనం. మొదటిసారి రెండోసారి

ట్రాక్టర్ 5000 15000

పది టన్నుల బరువు లారీ 50,000, లక్ష రూపాయలు

10 టన్నులకు పైగా బరువు యంత్రాలు 50 వేలు, లక్ష
మూడోసారి పట్టుబడితే వాహనం యంత్రాన్ని సీజ్ చేసి వేలం వేసే అవకాశాలు ఉంటాయి.

Also Read: హీరో విజయ్ కారు నెంబర్ వెనుక ఉన్న రహస్యం అదేనా?

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×