BigTV English

BRS: రాజయ్యకు అలా.. చిన్నయ్యకు ఇలా.. ఎందుకలా?

BRS: రాజయ్యకు అలా.. చిన్నయ్యకు ఇలా.. ఎందుకలా?
brs

BRS: కొన్నాళ్లుగా బీఆర్ఎస్‌లో మోస్ట్ కాంట్రవర్సీ ఎమ్మెల్యేలు ఆ ఇద్దరు. కాంట్రవర్సీ అంటే ఏ కబ్జాలో, గొడవలో, దందాలో కాదు. మరీ గలీజ్ యవ్వారాల్లో ఇరుక్కుపోయారు. వాళ్లే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.


వీళ్లిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. మహిళలను గిల్లడంలో తాటికొండ రాజయ్య బాగా ఫేమస్. అనేకసార్లు వీడియోలకే అడ్డంగా చిక్కారు. సర్పంచ్ నవ్య మేటర్ రచ్చ రచ్చ అయింది. విషయం కేసీఆర్ వరకూ వెళ్లింది.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యది మరో టైప్. ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ చాన్నాళ్లుగా చిన్నయ్యపై ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్నారు. తనను లైంగికంగా వేధించారని.. తనకు అసభ్య మెసేజ్‌లు పెట్టారని.. మీటింగ్‌కని పిలిచి చేయి పట్టుకుని బలవంతం చేయబోయారని.. సంచలన ఆరోపణలు చేశారు. అందుకు వ్యతిరేకించినందుకు తనపైనే కేసులు పెట్టారని, ఆర్థికంగా దెబ్బతీశారని అంటున్నారు. దుర్గం చిన్నయ్యపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పోరాడుతున్నారు. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు.


ఫుల్ కాంట్రవర్సీగా మారిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఫసక్ అంటూ ప్రచారం జరిగింది. అయితే, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విషయంలో ఆడియోలు, వీడియోలు ఉండటం.. పార్టీ కీలక నాయకురాలి గురించి కూడా అసభ్యంగా మాట్లాడటంతో.. రాజయ్యపై వేటు పడింది. దుర్గం చిన్నయ్యది బహుషా ఆయన పర్సనల్ మేటర్ అనుకున్నారేమో.

రాజయ్యకు టికెట్ ఇవ్వకపోవడాన్ని అంతా సమర్థిస్తున్నా.. చిన్నయ్యపై కూడా చర్యలు తీసుకుంటే బాగుండేదని అంటున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×