E-Paper
Advertisement

KCR : కేసీఆర్ కు గజ్వేల్ లో ఓటమి భయం.. కామారెడ్డి నుంచీ పోటీ.. ముందే చెప్పిన రేవంత్

KCR : కేసీఆర్ కు  గజ్వేల్ లో ఓటమి భయం.. కామారెడ్డి నుంచీ పోటీ.. ముందే చెప్పిన రేవంత్
Advertisement

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ తన పోటీపై ట్విస్ట్ ఇచ్చారు. కేసీఆర్ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారు. గజ్వేల్ తోపాటు కామారెడ్డి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్ తాను రెండు చోట్ల పోటీ చేస్తానని ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయరని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన పోటీ చేసే స్థానంపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. పెద్దపల్లి, కామారెడ్డి ఇలా చాలా పేర్లు వినిపించాయి. చివరికి కామారెడ్డినే కేసీఆర్ ఎంచుకున్నారు. ప్రస్తుతం కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్ ప్రాతినిత్యం వహిస్తున్నారు. కేసీఆర్ పోటీకి సిద్ధంకావడంతో గంప గోవర్ధన్ కు టిక్కెట్ దక్కలేదు.

Advertisement

గంప గోవర్ధన్ కామారెడ్డి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో టీడీపీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2009 రెండో టీడీపీ నుంచే గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అలాంటి నేతను పక్కకు తప్పించి కేసీఆర్ పోటీకి దిగనుండటం ఆసక్తి రేపుతోంది.

ప్రస్తుతం కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిత్యం వహిస్తున్నారు. అక్కడ ఈసారి గట్టి పోటీ ఎదురవుతుందనే అంచనాలున్నాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ తాను పోటీలో ఉంటానని ప్రకటించి కేసీఆర్ లో టెన్షన్ పెంచారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారని టాక్. కేసీఆర్ కు కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ అలీ బరిలో ఉంటారు. ఆయన 1989, 2004లో అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement

కేసీఆర్ 2014లో తొలిసారిగా గజ్వేల్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దాదాపు 19 వేల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. 2018 ఎన్నికల్లోనూ అక్కడ నుంచే కేసీఆర్ బరిలోకి దిగారు. ఈసారి కాంగ్రెస్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. 2018లో కేసీఆర్ దాదాపు 58 వేల మెజార్టీతో గెలిచారు. కానీ ఈసారి విజయంపై అనుమానం కలగడంతో ఓటమి భయం పట్టుకుని కేసీఆర్ గజ్వేల్ తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయబోతున్నారని రాజకీయ విశ్లేషకుల మాట.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×