E-Paper
Advertisement

మనసు మార్చుకున్న దానం.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు? అలర్టయిన మిగతా పార్టీలు, ఏం జరుగుతోంది?

మనసు మార్చుకున్న దానం.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు? అలర్టయిన మిగతా పార్టీలు, ఏం జరుగుతోంది?
Advertisement

Hyderabad: తెలంగాణలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానుందా? దానం నాగేందర్‌ ఎందుకు మనసు మార్చుకున్నారు? అసలు సుప్రీంకోర్టుకు వెళ్లనని చెప్పిన ఆయన, ఎందుకు ప్రత్యేకంగా పిల్ దాఖలు చేశారు? సోమవారం ఆయన పిటిషన్ విచారణకు రానుందా? ఈ ఎపిసోడ్ కొన్నిరోజులు కొనసాగే అవకాశముందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.

మనసు మార్చుకున్న దానం

తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు దానం నాగేందర్ చుట్టూ తిరుగుతున్నాయి. ఎలాగైనా ఉప ఎన్నిక తీసుకురావాలని విపక్షాలు భావిస్తున్నాయి. అందుకోసం తెర వెనుక మంతనాలు జోరుగా సాగుతున్నాయి. హైకోర్టు అనర్హత వేటు వేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లనని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని కుండబద్దలు కొట్టేశారు దానం నాగేందర్. ఆ మాట చెప్పిన కొన్ని గంటల వ్యవధిలో వెంటనే ఆయన మనసు మార్చుకున్నారు.  స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఉన్నట్లుండి.. ఈ మార్పు వెనుక ఏం జరిగింది? జరుగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందని వెంటాడుతున్నాయి.

సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్, అలర్టయిన మిగతా పార్టీలు

Advertisement

అనర్హతపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దానం నాగేందర్. శనివారం దానం తరఫున అడ్వకేట్ యోగేశ్ వెంకట స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్​రెడ్డిని ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ డైరీ వద్ద నెంబర్ అలాట్ అయ్యింది. ఈ పిటిషన్‌పై సోమవారం దానం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో మెన్షన్ చేయనున్నారు. మరోవైపు దానం కేసులో మహేశ్వర్ రెడ్డి తరపు మనిష్ తివారి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దానం పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని అందులో ప్రస్తావించారు.

దానం నిర్ణయం వెనుక ఏం జరిగింది?

దానం నిర్ణయం వెనుక కారణాలు లేకపోలేదు. నార్మల్‌గా అయితే కోర్టు నిర్ణయాలు అంటే చెప్పనక్కర్లేదు. తీర్పు రావడానికి కాస్త డిలే అవుతుంది. తెలంగాణలో ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. ఈలోగా పిటిషన్ వేయడంతో అది కాస్త డిలే అవుతుందని భావన. ఈలోగా ఎన్నికలు వస్తాయని భావించి పిటిషన్ దాఖలు చేసినట్టు దానం మద్దతుదారులు చెబుతున్నారు. అందువల్ల ఆయన వేగంగా పావులు కదిపి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని అంటున్నారు.

Advertisement

ALSO READ: తెలంగాణ ఉపాధి హామీ కూలీలకు షాక్.. ఈ-కేవైసీ లేకపోతే వేతనాలు బంద్!

ఒకవేళ ఉపఎన్నిక అనివార్యమైతే.. బీఆర్ఎస్ డ్రాప్ అవ్వాలని ఆలోచన చేస్తోందట. భూకబ్జా వ్యవహారం నేపథ్యంలో నెగిటివ్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడంతో దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఇదే సమయంలో బీజేపీ నిలబడితే ఆ అభ్యర్థికి అంతర్గతంగా మద్దతు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ పరిణామాలు గమనించిన దానం, సైలెంట్‌గా పిల్ దాఖలు చేసినట్టు చెబుతున్నారు.

Related News

తెలంగాణ ఉపాధి హామీ కూలీలకు షాక్.. ఈ-కేవైసీ లేకపోతే వేతనాలు బంద్!

డివైడర్‌ని ఢీ కొట్టిన కారు, ఓ వ్యక్తి సజీవదహనం! సూర్యాపేట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సీఎం రేవంత్‌రెడ్డి సూచన.. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త పేర్లు, కాకతీయులకు పేర్లపై అందరిచూపు

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

Big Stories

Advertisement
×