School Uniforms:తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాంలో కొత్త మార్పులు రాబోతున్నాయి .అవును ..విద్యార్థులు వేసుకునే యూనిఫామ్స్ రెగ్యులర్ గా కాకుండా చూడగానే ఆకర్షణీయంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
విద్యార్థుల యూనిఫాంలు, నోట్‌బుక్స్, ఇతర విద్యా సామగ్రి పంపిణీపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం పలు సూచనలు చేశారు
స్కూల్ తెరిచిన తర్వాత నెలలకు నెలలు గడిచాక యూనిఫాంలు ఇవ్వడం కాకుండా.. బడి మొదలైన రోజే విద్యార్థులకి యూనిఫాం, పుస్తకాలతో పాటు , ఇతర సామగ్రి అన్నీ అందేలా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
గతంలో స్కూల్స్ కి యూనిఫామ్స్ తో పాటు ఇతర వస్తువులని అందించినపుడు ఏర్పడ్డ ఇబ్బందులు ఈసారి ఎదురుకాకూండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఇక ఈ మధ్యే ప్రభుత్వం 27.5 లక్షల మంది విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. విద్యార్థులకు అందించే వస్తువుల నాణ్యత విషయంలో రాజీ పడబోమని సీఎం స్పష్టం చేశారు కూడా .విద్యార్థుల సంఖ్య ఈసారి కంటే దాదాపు 10 శాతం పెరగొచ్చన్న అంచనాతో ముందుగానే అవసరమైన యూనిఫాంలు, పుస్తకాలు, ఇతర సామగ్రి కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు
ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మరో జత యూనిఫాంను కూడా ఈ నెల చివరిలోగా విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ,ఇక నోట్ పుస్తకాలతో పాటు హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు అవసరమైన సామగ్రి పంపిణీ కూడా పూర్తయిందని తెలిపారు .
.సర్కార్ స్కూల్స్ లో చదివే పిల్లల జీవితాల్లో వెలుగులు తేవాలన్నా లక్ష్యంతో ప్రభుత్వం పలు కీలక మార్పులు తీసుకొస్తోంది. గతంలో యూనిఫాం అంటే ఒకే తరహా డిజైన్, తో ఉండేదన్న సంగతి తెల్సిందే
ALSO READ :కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్
మొత్తానికి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది.ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థులకు భోజనం, స్నాక్స్ వంటి సదుపాయాలు కల్పించడం, స్కూళ్లలో మౌలిక వసతులు పెంచడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం విశేషం.