Suryapet: సీజన్ మారింది.. వర్షకాలం కాస్త ఎండాకాలంగా మారిపోయింది. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో వాహనాలు దగ్దమైన ఘటనలు క్రమంగా రెట్టింపు అవుతున్నాయి. ఆ తరహా ప్రమాదాలు ఇటీవలకాలంలో చోటు చేసుకున్నాయి. తాజాగా ఆదివారం ఉదయం సూర్యాపేట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి కారులోనే సజీవ దహనమయ్యాడు. అసలు ఘటన ఎలా జరిగింది?
ఖమ్మం నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో అతి వేగంగా వస్తున్న ఓ కారు.. డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫలితంగా కారు పూర్తిగా దగ్ధమైంది. అందులోని ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సూర్యాపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైనది వోల్వో కారని గుర్తించారు. ప్రమాదం సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేదానిపై స్పష్టత రాలేదు. అయితే దగ్ధమైన వాహనంలో మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటన ఆదివారం ఉదయం 7.15 గంటల సమయంలో జరిగినట్లు గుర్తించారు. కారు నంబర్ ప్లేట్ దగ్ధం కావడంతో వాహనం, మృతుడి వివరాలు గుర్తించడం సవాలుగా మారింది. ఈ క్రమంలో ఖమ్మంలో టోల్ ప్లాజాల వద్ద సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వాహనాల రికార్డుల ఆధారంగా వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: సీఎం రేవంత్‌రెడ్డి సూచన.. వరంగల్ ఎయిర్‌పోర్టుకు కొత్త పేర్లు, కాకతీయులకు పేర్లపై అందరిచూపు