Warangal AirPort: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాల వల్ల వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న చిరకాల స్వప్నం సాకారమవుతోంది. మామునూరులో కట్టనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి పేరుపై సూచనలు ఇవ్వాలని ప్రజలను ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజాపాలనలో వరంగల్ ప్రజల దశాబ్దాల కల మామునూరు విమానాశ్రయం త్వరలో నిజం కాబోతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఆయా భూములను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఏఏఐకి అప్పగించినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. భూసేకరణ కోసం రూ.295 కోట్లు కేటాయించింద, క్షేత్రస్థాయిలో పనులు వేగంగా ఊపందుకుంటున్నాయని రాసుకొచ్చారు.
మామునూరు ఎయిర్‌పోర్టు ప్రయాణికుల రాకపోకల కోసం కాకుండా.. పరిశ్రమలు, పర్యాటకం, విద్యారంగం, ఉద్యోగ అవకాశాలు, భారీ పెట్టుబడులకు ముఖద్వారంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ విమానాశ్రయం తెలంగాణకు నూతన చిహ్నంగా మారుతుందన్నారు. ఇక్కడి నుంచి విమాన ప్రయాణాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని తానూ ఆసక్తి ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. అలాగే వరంగల్ కొత్త విమానాశ్రయానికి ఏ పేరు పెడితే బాగుంటుందో ప్రజలు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.
పదేళ్లు అధికారంలో ఉండి కుటుంబ ప్రయోజనాలు, విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లపైనే దృష్టి సారించారని పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్టు కలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతులు, భూసేకరణ, సాంకేతిక పరమైన పరిశీలన దశలను దాటేసింది. నిర్మాణ పనుల కోసం మూడు ప్యాకేజీలుగా చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. రెండు ప్యాకేజీల పనులకు వేర్వేరుగా టెండర్లు ప్రక్రియను పూర్తి చేసింది.
విమానాశ్రయం నిర్మాణం జరిగే ప్రాంతం చుట్టూ 953 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మాణం తొలి ప్యాకేజీలో ఉంది. ఇక రన్‌వే, పార్కింగ్, సీవరేజ్ వ్యవస్థ నిర్మాణ పనులు రెండో ప్యాకేజీలో ఉన్నాయి. చివరి ప్యాకేజీ పనులు టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఫైర్ స్టేషన్, విద్యుత్తు సబ్‌స్టేషన్ నిర్మాణాలను సంబంధించి తాజాగా టెండర్లు పిలిచి నవంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణను సిద్ధం చేసింది. అంతా అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో శంకుస్థాపన చేయనున్నట్లు ఏఏఐ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో
తన సొంత పట్టణం వరంగల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం పట్ల బహిరంగంగా ప్రశంసలు కురిపించారు బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ ప్రాంతపు చారిత్రక వారసత్వాన్ని గౌరవిస్తూ దానికి కాకతీయ రాజవంశం పేర్లు ఉంటే బెటరని సూచన చేశారు. వారసత్వం, శౌర్యం, సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబించేలా ఆ పేరు ఉండాలని నొక్కి చెబుతూ రెండు పేర్లు సూచించారు. రుద్రమదేవి అంతర్జాతీయ విమానాశ్రయం లేకుంటే కాకతీయ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టాలని సూచించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగారియాక్ట్ అయ్యారు.
That’s the SPIRIT..!! https://t.co/6nWMLYN4yc
— Revanth Reddy (@revanth_anumula) September 19, 2026