E-Paper
Advertisement

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్
Advertisement

Adi Srinivas:ప్రస్తుతం తెలంగాణలో భూ పంచాయితీ నడుస్తుంది.తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల ఎకరాలు దోచుకున్నారంటూ సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెల్సిందే.

ఇక ఇదే విషయంపై పలు సంచలన కామెంట్స్ చేశారు వేములవాడ MLA , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ .. కల్వకుంట్ల కుటుంబం భూముల వ్యవహారం బయటకు రావడంతోనే కేటీఆర్, హరీశ్ రావు అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని తప్పిస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

రైతుల సమస్యలపై మాట్లాడుతున్నామంటూ కేటీఆర్, హరీశ్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని,దీని వెనుక వారికి రాజకీయంగా లభ్ది పొందాలన్న ఆలోచన ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన భూముల అంశానికి సమాధానం చెప్పాల్సిన సమయంలో నీళ్లు, కరెంట్, పంటల సమస్యలను ముందుకు తెస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే ఇదే సమయంలో రైతుల ఇబ్బందులు నిజమైనవేనని, వాటిపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.

అయితే ఎల్‌నినో కారణంగా ప్రాజెక్టులు అనుకున్న స్థాయిలో నిండకపోవడంతో కరువు ఏర్పడిందని అన్నారు.అందుకే  రైతులు వారి కాకూండా ఇతర పంటల వైపు వెళ్లాలని ప్రభుత్వం గతంలోనే చెప్పిందని తెలిపారు .

Advertisement

ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అవసరమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఉత్పత్తి సరిపోకపోయినా విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేస్తున్నామని చెప్పుకొచ్చారు.ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు ఖర్చు చేశారని,కానీ దానికి బదులుగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని ఆయన అన్నారు. కాళేశ్వరం విషయంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు.

భూముల విషయానికి వస్తే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వందల ఎకరాలు కబ్జా పెట్టారన్న వార్తల నడుమ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అక్కడ పర్యటిస్తున్న సంగతి తెల్సిందే.

కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి ని ఉద్దేశిస్తూ .. రెండు కుటుంబాల ఆస్తులపై న్యాయ విచారణ జరిపించాలని సవాల్ చేయగా హరీశ్ రావు కూడా సీఎం ఆరోపణలను తిప్పికొడుతూ రెండు కుటుంబాల ఆస్తులపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ALSO READ:మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

మొత్తంగా చూస్తే తెలంగాణలో ఒకవైపు భూముల లెక్కలు.. మరోవైపు నీళ్ల లెక్కలు.. ఇంకోవైపు కరెంట్ సమస్య.. మధ్యలో రైతులు. అన్నట్టుగా తయారైంది.చూడాలి మరి ఎవరి వాదన నెగ్గుతుందో !

Tags

Related News

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

హైకోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు దానం నాగేందర్!

Big Stories

Advertisement
×