E-Paper
Advertisement

మైలేజీకి మారుతి కొత్త ప్లాన్.. బాలెనో CNG-AMT వచ్చేసింది!

మైలేజీకి మారుతి కొత్త ప్లాన్.. బాలెనో CNG-AMT వచ్చేసింది!
Advertisement

Maruti Baleno CNG AMT: మారుతి సుజుకి బాలెనో కొనాలనుకునే వారికి మరో సూపర్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు CNG వెర్షన్‌ లో మాన్యువల్ గేర్‌ బాక్స్ మాత్రమే ఉండగా.. ఇప్పుడు కంపెనీ CNGతో పాటు AMT గేర్‌బాక్స్ ను కూడా మార్కెట్ కు పరిచయం చేసింది. ఇకపై ట్రాఫిక్‌లో క్లచ్, గేర్ మార్చే ఇబ్బంది లేకుండా CNG కారును నడపాలనుకునే వారికి ఈ కొత్త వేరియంట్ అనుకూలంగా ఉంటుంది. కొత్త బాలెనో CNG-AMT ప్రారంభ ధర రూ.8.32 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ పవర్‌ ట్రెయిన్‌ ను డెల్టా, జీటా వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మారుతి సుజుకి ప్రకటించింది.

అదే 1.2 లీటర్ ఇంజిన్!

బాలెనో CNG AMTలో మారుతి సుజుకి Z12E 1.2 లీటర్, మూడు సిలిండర్ల ఇంజిన్‌ తో తీసుకొచ్చింది. దీనికి 5 స్పీడ్ AMT గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేశారు. CNG మోడ్‌ లో ఈ ఇంజిన్ 70hp పవర్, 102Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పవర్ పరంగా ఇప్పటికే ఉన్న CNG మాన్యువల్ వెర్షన్‌ తో సమానంగా ఉంటుంది. గేర్‌ బాక్స్ మార్పుతో డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ లో  తేడా కనిపించనుంది.

కిలోకు 34.47 కిలోమీటర్ల మైలేజీ!

Advertisement

మారుతి బాలెనో CNG AMTలో మైలేజీపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కంపెనీ వివరాల ప్రకారం ఈ కొత్త వెర్షన్ కిలో CNGకి 34.47 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. CNG మాన్యువల్ వెర్షన్ కంటే 0.86 కిలోమీటర్లు ఎక్కువ. అంటే రోజువారీ ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి ఇంధన ఖర్చు విషయంలో కొంత మేలు కలిగే అవకాశం ఉంటుంది.

 తగ్గనున్న బూట్ స్పేస్

CNG కార్లలో సాధారణంగా ఎదురయ్యే సమస్య బాలెనోలోనూ కనిపిస్తుంది. CNG ట్యాంక్‌ ను కారు కింద అమర్చకుండా బూట్‌ లోనే ఏర్పాటు చేశారు. దీంతో CNG ట్యాంక్‌ తో పాటు స్పేర్ వీల్ కూడా బూట్‌ లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ బాలెనోతో పోలిస్తే లగేజ్ పెట్టుకునే స్థలం చాలా వరకు తగ్గుతుంది.

సెగ్మెంట్‌లో ప్రత్యేకమైన ఆప్షన్

Advertisement

CNGతో పాటు AMT గేర్‌ బాక్స్‌ ను అందిస్తున్న కాంపాక్ట్ కార్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం బాలెనోకు ఈ  టాటా ఆల్ట్రోజ్ ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తోంది. ఆల్ట్రోజ్ కూడా బూట్‌లో రెండు CNG సిలిండర్లను ఏర్పాటు చేసి, సుమారు 210 లీటర్ల లగేజ్ స్పేస్‌ను అందిస్తోంది.

సస్పెన్షన్‌ లో కీలక మార్పులు

కొత్త పవర్‌ ట్రెయిన్‌ కు అనుగుణంగా బాలెనో CNG AMT సస్పెన్షన్‌ ను కూడా పెట్రోల్ వెర్షన్‌ తో పోలిస్తే రీట్యూన్ చేశారు. మిగతా డిజైన్, ఫీచర్లు, పరికరాల్లో పెద్దగా మార్పులు ఉండవు.

Read Also: టిగోర్ స్థానంలో టాటా ఏరిస్.. డిజైర్, అమేజ్‌ కు గట్టి పోటీ తప్పదా?

Tags

Related News

టిగోర్ స్థానంలో టాటా ఏరిస్.. డిజైర్, అమేజ్‌ కు గట్టి పోటీ తప్పదా?

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

Big Stories

Advertisement
×