E-Paper
Advertisement

BRS : బీఆర్ఎస్ దూకుడు బ్రేక్ వేసిన ‘డ్రగ్స్’!

BRS : బీఆర్ఎస్ దూకుడు బ్రేక్ వేసిన ‘డ్రగ్స్’!

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించాలని ఆ పార్టీ భావించగా అనుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. తాండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. మొయినాబాద్‌లోని ఆయన సొంత ఫాంహౌజ్‌లో నిన్న రాత్రి పార్టీ జరిగింది. డ్రగ్స్ తీసుకుంటున్నారని సమాచారం రావడంతో ‘ఈగల్ టీం’ దాడులు నిర్వహించగా.. రోహిత్ రెడ్డితో పాటు మరో 11 మంది పట్టుబడ్డారు. వారికి డ్రగ్స్ టెస్టు నిర్వహించగా.. పలువురు కొకైన్ తీసుకున్నట్టు ఈగల్ టీం నిర్దారించింది.బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో పాటు ఏపీలోని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేశ్ కుమార్ సైతం డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది.
ప్రస్తుతం వీరంతా ఈగల్ టీం అదుపులో ఉన్నట్టు తెలుస్తున్నది.

బీఆర్ఎస్‌కు డ్రగ్స్ లింక్స్..

గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సమయంలో నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే విషయంపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఈగల్ బృందాన్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్ సప్లయ్, వినియోగించే వారిపై ఈగల్ ఫోకస్ పెట్టి వారిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపింది. కాగా, గతంలో బీఆర్ఎస్ డ్రగ్స్‌ను నిర్మూలించకుండా కమీషన్ల కోసం అక్రమార్కులతో కుమ్మక్కై డబ్బులు పోగెసుకుందని ఆ పార్టీ మీద ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం డ్రగ్స్ తీసుకుంటారని, ఆయనకు సైతం డ్రగ్స్ టెస్టు నిర్వహించాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

కేటీఆర్ ఏం చెబుతారు?

తాజాగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ఇంతకాలం తమ పార్టీ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకం అని చెబుతూ వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీనిపై ఏవిధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకూ ఆయన ఈ ఘటనపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఒకవేళ రోహిత్ రెడ్డికి మద్దతుగా పార్టీ నిలుస్తుందా? లేదా అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడి, ప్రజల్లో పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించి ఆయన్ను సస్పెండ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది. కేటీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీకి మేలు జరగాలనే కానీ, కీడు జరగొద్దని గులాబీ కేడర్ ఆశిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇంతకాలం తనపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేనందున కొట్టిపారేస్తూ లేదా నోటీసులు పంపిస్తూ తప్పించుకున్న కేటీఆర్.. ఇప్పుడు రోహిత్ రెడ్డి విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారనేది తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది.

Allu Arjun: అల్లు అరవింద్ ఇంటికి ఏపీ సీఎం..క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్..పోస్ట్ వైరల్!

ఇదిలాఉండగా, బీఆర్ఎస్ పార్టీపై గతంలోనూ డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో డ్రగ్స్ అంశం వెలుగులోకి రాగా.. అప్పుడు సినీ సెలబ్రిటీలు పేర్లు సైతం వినిపించాయి. నాడు ఓ హీరోయిన్, ఆమె తమ్ముడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోగా కేటీఆర్ వారికి సాయం చేశారని సైతం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కేటీఆర్, సదరు హీరోయిన్ మధ్య కథ నడిచిందని సైతం రూమర్స్ రాగా.. ఆయన కొట్టిపారేశారు. ఆ నటి మాత్రం హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకు మార్చింది. కాగా, గులాబీ పార్టీలో డ్రగ్స్ తీసుకోవడం లేదని నిరూపించాలంటే.. కేటీఆర్ సైతం టెస్టు చేయించుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేయడం గమనార్హం.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×