Big Stories

Munugode : ఫాంహౌజ్ ఎపిసోడే కొంపముంచిందా? లేదంటే, బీజేపీనే గెలిచేదా?

Munugode : మునుగోడు గెలుపుపై బీజేపీ ధీమాగా ఉండే. ఎలాగైనా గెలిచి తీరుతామని అనుకునే. కానీ, పార్టీ ఒకటి తలిస్తే ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. ఆ షాక్ నుంచి కమలనాథులు కోలుకోలేక పోతున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోయి ఉంటే.. తెలంగాణలో ఇక కేసీఆర్ పని ఖతం అని ప్రజల్లోకి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లి ఉండేదని.. మంచి ఛాన్స్ మిస్ అయ్యామంటూ కలత చెందుతున్నారు.

- Advertisement -

తొలినాళ్లలో బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉండేవి. ప్రభాకర్ రెడ్డి కంటే రాజగోపాల్ రెడ్డి అన్ని అంశాల్లోనూ బలమైన అభ్యర్థి కావడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు ఆ పార్టీ నేతలు. అంతా సాఫీగా సాగుతోందని అనుకుంటుండగా.. మొయినాబాద్ ఫాంహౌజ్ ఎపిసోడ్ కమలదళాన్ని ఓ కుదుపు కుదిపేసింది. పార్టీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసిందని విశ్లేషిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న సమయంలో ఫాంహౌజ్ ఎమ్మెల్యేల డీల్ ఆడియోలను లీక్ చేసి.. బీజేపీ గెలుపు అవకాశాలను కేసీఆర్ దెబ్బ తీశారని అంటున్నారు.

- Advertisement -

బూర నర్సయ్య గౌడ్ ను పార్టీలో చేర్చుకుని లాభ పడదామని చూస్తే.. కౌంటర్ గా బీజేపీ నుంచి ముగ్గురు పెద్ద లీడర్లను లాగేసినప్పుడే కేసీఆర్ జోరుపై అప్రమత్తమై ఉండాల్సింది. మునుగోడుకు ముందు ఫాంహౌజ్ ఎమ్మెల్యేల ట్రాప్ జరగడం.. అన్నివేళ్లూ బీజేపీ వైపే చూపెట్టడంతో.. జరగరాని నష్టం జరిగిపోయింది. రాజగోపాల్ రెడ్డి అంటే అభిమానం ఉన్నా.. బీజేపీపై మాత్రం అసహనం ఏర్పడిందని అంటున్నారు. ఎంత కాదన్నా.. అంతా బీజేపీనే చేసిందనేలా ఫాంహౌజ్ విషయం ప్రజల్లోకి వెళ్లిపోయింది. యాదాద్రి గుడిలో బండి సంజయ్ తడిబట్టలతో ప్రమాణం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని భావిస్తున్నారు. ఆ మేరకు జాతీయ నాయకత్వానికి ఓ నివేదిక ఇవ్వనున్నారట రాష్ట్ర పార్టీ నేతలు.

దొంగ ప్రమాణాలు చేసిన బీజేపీ నాయకులకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తగిన శిక్ష వేశాడంటూ.. మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన కామెంట్స్ కమలనాథులను బాగా హర్ట్ చేస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News