BigTV English

Nagole Road Accident : బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. తండ్రి,కొడుకు మృతి

Nagole Road Accident : బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. తండ్రి,కొడుకు మృతి

Nagole Road Accident: హైదరాబాద్‌ నాగోల్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. బైకును టిప్పర్‌ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన ప్రదీప్‌ అనే వ్యక్తి, తన తండ్రితో బైక్‌పై బయటకు వెళ్లాడు. నాగోల్ గౌరెల్లి పాపన్న గూడా చౌరస్తా వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన టిప్పర్‌ బలంగా ఢీ కొట్టింది.


ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు చనిపోయారు. ప్రమాద సమయంలో టిప్పర్‌ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. టిప్పర్‌ ముందు భాగం దగ్ధమవ్వడంతో పాటు బైక్‌ కూడా కాలి బూడిదైంది. బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. తండ్రి, కుమారుల మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇంటి యజమాని, కొడుకు ఒకేసారి అనంతలోకాలకు వెళ్లిపోవడంతో.. ఆ ఇల్లాలు ఒంటరైంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి,కొడుకు మరణించడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Related News

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

West Godavari Crime: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య, సోదరుడికి మెసేజ్, పాలకొల్లులో దారుణం

Fire Accident: ఏపీ, తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు

UP Crime News: మైనర్ ప్రియురాలిని కాల్చిన ప్రియుడు, ఆ తర్వాత ఏం జరిగింది? యూపీలో దారుణం

Big Stories

×