CMR Rice Scam: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్, ర ఈ సీజన్లలో రైతులు సాగుచేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించి మిల్లర్లకు అప్పగించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన అనంతరం వచ్చిన బియ్యాన్ని తిరిగి సివిల్ సప్లై శాఖకు అప్పగించాల్సి ఉంటుంది.వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ ప్రక్రియను కొందరు రైస్ మిల్లర్లు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చు కుంటున్నారు. రూపాయి కూడా పెట్టుబడి లేకుండా మిల్లులకు వచ్చిన వడ్లతో పాటు ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్లు దండుకుంటున్నాన్నారు. ఇటీవల గద్వాల జిల్లాలో పలు రైస్‌మిల్లుల్లో అధికారుల తనిఖీల్లో వెల్లడైన లెక్కలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కేవలం వేల క్వింటాళ్ల ధాన్యం రికార్డుల్లో మాత్రమే ఉంటుంది తప్ప ఆ మేరకు రైస్ మిల్లులలో ధాన్యం నిల్వ ఉండడం లేదు.
రూపాయి పెట్టుబడి లేకుండా ప్రభుత్వమే ధాన్యం ఇవ్వడం మర ఆడించిన తర్వాత 67 శాతం బియ్యం మాత్రమే తిరిగి ఇవ్వాలని నిబంధనలు ఉండడంతో మిల్లు యజమానులకు బియ్యం వ్యాపారం కాసులు కురిపిస్తుంది. గద్వాల జిల్లాలో 60 వరకు మాత్రమే మిల్లులు ఉండేవి. ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు మర ఆడించి ఇవ్వడానికి ఉచితంగా ఇస్తుండడంతో ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారంగా మారింది. దీంతో కొత్త మిల్లులు పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చాయి. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వ ధాన్యం ఇస్తుండడంతో మిల్లుల యజమానులు సిఎంఆర్ ధాన్యాన్ని తమ వ్యాపార పెట్టుబడులుగా మార్చుకుంటున్నారు. ఈ సీజన్లో ఇచ్చిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వానికి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ సదరు ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ దందా ఏళ్ల తరబడి అడ్డూఅదుపు లేకుండా సాగడానికి పౌరసరఫరాల శాఖలోని కొందరు ఉన్నతాధికారులు, కిందిస్థాయి ఇన్ స్పెక్టర్లు, డిపో మేనేజర్ల తోడ్పాటే కారణమనే ఆరోపణలున్నాయి. ప్రతి నెలా మిల్లుల్లో ధాన్యం నిల్వలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటుపడి ఖాళీ గోదాముల్లో కూడా నిల్వ ఉన్నట్లు కాగితాలపై రికార్డు రాస్తున్నారు. ఒక్కో లారీ రీ-సైక్లింగ్ బియ్యాన్ని ఎఫ్ సి ఐ ,సివిల్ సప్లైస్ గోదాముల్లో అన్-లోడ్ చేయించడానికి .10,000 నుంచి .15,000 లంచాల చేతులు మారుతున్నట్లు సమాచారం. సిండికేట్ పుణ్యమా అని ప్రజాధనం లూటీ చేస్తూ పేదలకు తిరిగి రేషన్ బియ్యమే దక్కుతున్నాయనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పలు రైస్ మిల్లులో సీఎంఆర్ కోసం ఇచ్చిన వడ్లు మాయమయ్యాయి. ఆఫీసర్లు తనిఖీలు చేయగా ఈ విషయం బయటపడింది. వీటి విలువ దాదాపు రూ.6 కోట్లు ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గద్వాల పట్టణ పరిధిలోని బీరెల్లి రోడ్డులో ఒక రైస్ మిల్లు నుంచి అధికారులు కేటాయించిన వడ్లను పక్కదారి పట్టించారనే సమాచారంతో ఈ నెల 17న మిల్లుపై హైదరాబాద్ చెందిన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు ,ఎఫ్ సీఐ అధికారులు తనిఖీలు చేయగా సుమారు 50వేల బస్తాలు పక్కదారి పట్టినట్లు సమావారం. వీటి విలువ సుమారు రూ.6 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
Also read: దసరా పండుగవేల షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన నిత్యావసర వస్ధువుల ధరలు!
జిల్లాలోని రెండు మిల్లుల్లో ఇప్పటికే ధాన్యంలో భారీగా తేడాలు ఉన్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించారు. గద్వాల పట్టణ శివారులోని రెండు రైస్ మిల్లులో కోట్ల రూపాయల విలువైన ధాన్యం లోటును గుర్తించారు.
జిల్లాలోని 60కి పైగా మిల్లుల్లో మిగిలి ఉన్న ధాన్యం నిల్వలకు సంబంధించి ఒక్కో బస్తాకు 25 పైసల చొప్పున వసూలు చేసేందుకు బీరోల్లి రోడ్డులోని ఓ మిల్లు యజమాని మధ్యవర్తిత్వం నడిపినట్లు తెలుస్తుంది . ఈ వ్యవహారంలో పలువురు మిల్లుల యజమానులు కలిసి చక్రం తిప్పినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికారుల తనిఖీల సమయంలో సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ఈ వ్యవహారం సాగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నుండి వచ్చిన ఇద్దరు ఎఫ్ సీఐ అధికారులకు భారీగా ముడుపులు ఇచ్చేందుకు తెలుస్తుంది. మధ్యవర్తిత్వం నడుపుతున్నట్లు సమాచారం.
తనిఖీల సందర్భంగా సదరు మిల్లుపై చర్యలు తీసుకోకుండా జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఒక లాడ్జిలో అధికారులతో మంతనాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్, ఎఫ్‌సీఐ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మిల్లుల తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ ఓ షాడో మిల్లు యజమాని మధ్యవర్తిగా వ్యవహరిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
“ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా కొందరు అధికారులు సిండికేట్‌గా మారి ఈ దందాను నడుపుతున్నారు. పౌరసరఫరాల శాఖను వెంటనే ప్రక్షాళన చేసి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ‘సిట్’ విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లులను సీజ్ చేసి వారి ఆస్తులను చేయాలి.” అని ప్రజలు కోరుతున్నారు.
Also read: సింగరేణి ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. పూర్తి పే స్కేల్ పట్టిక ఇదే!