Ind vs Pak : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 09 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 14న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి పెంచేందుకు సోనీ స్పోర్ట్స్ స్పెషల్ వీడియోను రూపొందించింది. దీనికి హైప్ తీసుకొచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది సోనీ స్పోర్ట్స్. దీంతో సోనీ స్పోర్ట్స్ స్పెషల్ వీడియో ను రూపొందించడం పై సోషల్ మీడియా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్ కి సంబంధించి సోనీ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ప్రోమో వీడియో ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసిందనే చెప్పాలి. ఇటీవలే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Also Read : Virat Kohli : AB డివిలియర్స్ తల్లిని పచ్చి బూతులు తిట్టిన కోహ్లీ… ఇదిగో షాకింగ్ వీడియో
సోనీ స్పోర్ట్స్ పై మండిపడుతున్న అభిమానులు
అయితే ప్రస్తుతం అదే పాకిస్తాన్ తో మ్యాచ్ కి ప్రోమో చేసినందుకు సోనీ స్పోర్ట్స్ పై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అవసరమైతే ఆసియా కప్, సోనీ స్పోర్ట్స్ ను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో #BoycottAsiaCup, #ShameOnSonySports అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. బాధితుల కుటుంబాలను అవమానపరిచే విధంగా వీడియో ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. మరోవైపు ఈ ప్రకటనలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కనిపించడంతో అతనిపై సైతం విమర్శలు వినిపిస్తున్నాయి. “మనదే విజయం” అని సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను మరింత ఆగ్రహానికి గురి చేసాయి. ఈప్రచారంలో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ “మేము వరల్డ్ ఛాంపియన్లం. టీ-20, ఛాంపియన్స్ ట్రోఫీ మనదే. ఆసియా కప్ కూడా మనదే అవుతుంది ” అని పేర్కొన్నారు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ ని కూడా సెహ్వాగ్ పొగడ్తలతో ముంచెత్తారు.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అద్భుతం..
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అద్భుతం అనే చెప్పవచ్చని.. అతని కెప్టెన్సీలో జట్టు చాలా ఉంది. ఇక మనం గెలవడం ఖాయం అని స్పష్టం చేశారు. ఈ సారి ఆసియా కప్ కోసం భారత్ గ్రూపు ఏ లో పోటీ పడుతుంది. యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ వంటి దేశాలతో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 10 యూఏఈతో తొలి మ్యాచ్ లో తలపడనుంది భారత్. సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో భారీ పోరు ఉండనుంది. ఇక సెప్టెంబర్ 19న ఒమన్ తో గ్రూప్ దశ మ్యాచ్ ముగుస్తుంది. గ్రూపు దశ మ్యాచ్ లు ముగిసిన తరువాత టాప్ 4 నిలిచిన జట్లు తలపడుతాయి. ఆ తరువాత సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ తో ఆసియా కప్ ముగుస్తుంది. ఈ టోర్నీలో గ్రూపు ఏలో ఉన్న పాకిస్తాన్, భారత్ రెండు జట్లు ఫైనల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ తో క్రికెట్ ఆడకూడదని కొందరూ టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు. ఆసియా కప్ ని బాయ్ కాట్ చేయాలని సూచిస్తున్నారు.
140 crore dhadkanein ek saath dhadkegi apni #TeamIndia ke liye! 💙🇮🇳 Kyunki rag rag mein hain rang Bharat ka. 🇮🇳🔥
Dekhiye Asia Cup September 9 se Sony Sports Network ke TV Channels aur Sony LIV par!#RagRagMeinBharat #TeamIndia #AsiaCup #SonyLIV #SonySportsNetwork pic.twitter.com/SgCFONOm6n
— Sony Sports Network (@SonySportsNetwk) August 22, 2025
Turns out, sledging Virender Sehwag came with costly consequences 🤭@virendersehwag | #SonySportsNetwork #ACCMensAsiaCup2025 pic.twitter.com/APQ8u8XiTb
— Sony Sports Network (@SonySportsNetwk) August 27, 2025