Palghar Building Collapse: మహారాష్ట్రలోని విరార్‌లో విషాదం చోటుచేసుకుంది. విరార్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో 15 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో వారిలో 24 ఏళ్ల మహిళ, ఆమె శిశువు కుమార్తెగా గుర్తించారు. ఈఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది.
రంగంలోకి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు
విరార్ నారంగి ఫాటా వద్ద రమాబాయి అపార్ట్‌మెంట్ వెనుక భాగం కూలిపోవడంతో ఆ శిథిలాలు పక్కనే ఉన్న మరో చాల్‌పై పడింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళన వాతావరణం సృష్టించింది. దీంతో ఆప్రాంతంలో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు పెట్టారు. కాసేపు అయోమయంలో ఉన్న స్థానికులు తేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, వసాయ్-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. సహాయక చర్యలు కొనసాగించగా ఇప్పటివరకు 11 మందిని శిథిలాల కిందనుంచి సురక్షితంగా బయటకు తీశారు. గాయపడినవారిని సమీపంలోని విరార్, నలసోపారా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also read: Street Dog Attack: OMG!.. సైకిల్ పై వెళ్తున్న విద్యార్థిపై వీధికుక్క దాడి.. వీడియో చూస్తే..
మున్సిపల్ అధికారులు హెచ్చరికలు
ఈ భవనం సుమారు పదేళ్ల క్రితం నిర్మించారు. ఈ భవన నిర్మాణం అత్యంత ప్రమాదకరమైనదిగా మున్సిపల్ అధికారులు ముందే గుర్తించి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ప్రజలు ఆ అపార్ట్‌మెంట్‌లోనే ఉంటూ నివాసం కొనసాగడం ఈ ఘటనకు కారణమైంది. ఇంకా 10 నుంచి 11 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన ప్రాంతం లోపలికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ప్రయత్నాలకు ఆటంకంగా మారాయి. దీంతో అధికారులు భారీ యంత్రాలను వినియోగిస్తూ శిథిలాలను తొలగిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ ఇండు రాణి జాఖర్
శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని. ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలు బయటకు తీయగా, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా కలెక్టర్ ఇండు రాణి జాఖర్ తెలిపారు. నిరాశ్రయులైన కుటుంబాలను చందన్ సార్ సమాజ మందిరానికి తరలించి, వారికి ఆహారం, నీరు, వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనపై బిల్డర్ నితల్ గోపీనాథ్ సానేను పోలీసులు అరెస్టు చేశారు. భూమి యజమానిపై కూడా మహారాష్ట్ర రీజినల్ అండ్ టౌన్ ప్లానింగ్ (MRTP) చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేశారు.
VVMC అసిస్టెంట్ కమిషనర్ గిల్సన్ గోన్సాల్వెస్
శిథిలాల తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని VVMC అసిస్టెంట్ కమిషనర్ గిల్సన్ గోన్సాల్వెస్ చెప్పారు. 2008–2009లో నిర్మించబడిన ఈ భవనంలో 54 ఫ్లాట్లు, నాలుగు షాపులు ఉన్నాయని, 2012లో అనుమతి లేకుండా మార్పులు చేపట్టినట్టు వెల్లడించారు.