Must Visit Malls in Hyderabad: హైదరాబాద్ లో ఎన్నో అద్భుతమైన షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అదిరిపోయే ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో టేస్టీ ఫుడ్ జోన్లతో ఆకట్టుకుంటున్నాయి. మరీ ఎక్కువ ధరలు కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ ఉ అవకాశం కల్పిస్తున్నాయి. అంతేకాదు, ఈ మాల్స్ ఏడాది పొడవునా డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్, ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాయి. ఇంతకీ హైదరాబాద్ ఆకట్టుకునే టాప్ 5 షాపింగ్స్ మాల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ ఇనార్బిట్ మాల్, హైటెక్ సిటీ
హైదరాబాద్ లోని బెస్ట్ షాపింగ్ మాల్స్ లో ఇనార్బిట్ మాల్ ఒకటి. ఇందులో H&M, లెవిస్ లాంటి బ్రాండ్లకు 50 నుంచి 60 శాతం తగ్గింపును అందిస్తుంది. సంవత్సరానికి మూడుసార్లు ఎండ్ ఆఫ్ సీజన్ సేల్స్ తో పాటు, పార్ట్ నర్ క్రెడిట్ కార్డులు, లాయల్టీ యాప్ ల ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా అందిస్తున్నాయి.
⦿ GVK వన్ మాల్, బంజారా హిల్స్
ఈ హై ఎండ్ మాల్ ఎప్పుడూ కస్టమర్లను ఆకట్టుకునే ఆఫర్లు అందిస్తుంది. టామీ హిల్ ఫిగర్, జారా, MAC లాంటి క్లియరెన్స్ అమ్మకాల సమయంలో ప్రీమియం బ్రాండ్లపై 40 నుంచి 50 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. ఈ స్టోర్లలో ఎక్కువగా బై 2 గెట్ 1 ఫ్రీ అనే ఆఫర్ ను అందిస్తున్నది. ఈ మాల్ లో ఉన్న రెస్టారెంట్లలో వీకెండ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
⦿ శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొండాపూర్
శరత్ సిటీ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మాల్స్ లో ఒకటిగా కొనసాగుతోంది. ఇది బ్రాండ్ ఫ్యాక్టరీ, సెంట్రల్ లాంటి ఫ్యాక్టరీ, డిస్కౌంట్ అవుట్ లెట్ షాపుల ద్వారా ఏడాది పొడవునా 70 శాతం డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, గృహాలంకరణ వస్తువులపైనా కాంబో ఆఫర్లను అందిస్తుంది. ఇది స్మార్ట్ షాపర్లకు హాట్ స్పాట్ గా కొనసాగుతోంది.
⦿ ఫోరమ్ మాల్, కూకట్ పల్లి
ఫోరమ్ మాల్ ఫ్యాషన్, షూ, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలకు బాగా ఫేమస్. పాంటలూన్స్, వెస్ట్ సైడ్, రిలయన్స్ ట్రెండ్స్ లాంటి స్టోర్లలో తరచుగా ధరల తగ్గింపు లభిస్తుంది. ఇక పండుగల సందర్భంగా ఈ మాల్ లో బిగ్ సేల్ బొనాంజాలుగా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వినియోగదారులు షాపింగ్ చేసిన తర్వాత వోచర్లను, ఉచిత సినిమా టికెట్లను కూడా పొందే అవకాశం ఉంటుంది.
⦿ నెక్స్ట్ గల్లెరియా మాల్, పంజాగుట్ట
షాపర్స్ స్టాప్, మాక్స్ లాంటి ఫ్యాషన్ చైన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు, ఫ్లాట్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చాలా అవుట్ లెట్లు వినియోగదారులకు పండుగ సీజన్ లో క్రేజీ ఆఫర్లు అందిస్తాయి. ఇక్కడ ఎప్పుడూ లాయల్టీ ప్రోగ్రామ్ లను అందిస్తాయి. సో, ఇంకెందుకు ఆలస్యం టైమ్ ఉన్నప్పుడు ఈ మాల్స్ కు వెళ్లండి. షాపింగ్ ఎంజాయ్ చేయండి.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?