E-Paper
Advertisement

Bathula Prabhakar: చెన్నైలో దొరికిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆచూకీ.. పొలిటీషియన్ కాలేజీలో రూ.60 లక్షలు చోరీ

Bathula Prabhakar: చెన్నైలో దొరికిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆచూకీ.. పొలిటీషియన్ కాలేజీలో రూ.60 లక్షలు చోరీ
Advertisement

Bathula Prabhakar: తెలుగు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరుడుగట్టిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. విజయవాడ నుంచి తప్పించుకుని పారిపోయిన ప్రభాకర్, ప్రస్తుతం తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

చెన్నైలో సెటిల్ అయిన ప్రభాకర్ తన పాత పద్ధతిలోనే మరోసారి చేతివాటం చూపించాడు. చెన్నైలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీకి పాల్పడ్డాడు. ఎప్పటిలాగే కాలేజీ లాకర్లను పగులగొట్టి దాదాపు రూ.60 లక్షల నగదును కొల్లగొట్టాడు. ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ (CCTV Footage) పోలీసులకు చిక్కడంతో, అది బత్తుల ప్రభాకరే అని నిర్ధారించుకున్నారు. దొంగిలించిన డబ్బుతో అతను విలాసవంతమైన జీవితం (Lavish Life) గడుపుతున్నట్లు సమాచారం.

Advertisement

బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర చాలా పెద్దది. గతంలో హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రిజం పబ్ (Prism Pub) లో కాల్పులు జరిపి హల్చల్ సృష్టించిన ఘటనతో ఇతను వార్తల్లోకెక్కాడు. ఇతని శైలి విభిన్నం.. కేవలం ఇంజనీరింగ్ కాలేజీలనే టార్గెట్ చేస్తాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో చొరబడి, లాకర్లను పగులగొట్టి లక్షల రూపాయలు దోచుకున్నాడు. గతంలో పోలీసులకు పట్టుబడినట్లే పట్టుబడి, రాజమండ్రి సమీపంలో వారి కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు.

అప్పటి నుంచి ఏపీ, తెలంగాణ పోలీసులు ఇతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పుడు చెన్నై చోరీతో దొరికిన క్లూ ఆధారంగా రెండు రాష్ట్రాల పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో తమిళనాడులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

Read Also: CPI Kunamneni: ఉపాధి హామీలో గాంధీ పేరు తీసేయడం దేశద్రోహం.. మోదీ సర్కార్‌పై కూనంనేని ఫైర్

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×